Saarc Summit | పాక్ నోట సార్క్ మాట.. ఆహ్వానం అందలేదన్న ఇండియా!
Saarc Summit | ఐదేండ్ల తర్వాత పాక్ సార్క్ ఊసెత్తింది. ఇండియాకు ఆహ్వానం పంపామన్నది. కానీ ఆహ్వానం అందలేదని భారత్ పేర్కొంది.

Saarc Summit | దక్షిణాసియా దేశాల కూటమి (సార్క్) సదస్సుకు హాజరు కావాలని భారత్‌ను ఆహ్వానించినట్లు పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ తెలిపారు. అయితే, సార్క్ సదస్సుకు హాజరు కావాలని తమకు అధికారికంగా ఎటువంటి ఆహ్వానం అందలేదని భారత్ తెలిపింది. సార్క్ కూటమిలో భారత్‌తోపాటు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, మాల్దీవులు, నేపాల్ సభ్య దేశాలు. సార్క్ అంటే దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం. 2014లో నేపాల్ రాజధాని ఖాట్మండులో సదస్సు తర్వాత సార్క్ సభ్యదేశాలు మళ్లీ సమావేశం కాలేదు.
2016 సార్క్ సదస్సుకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. 2016 నవంబర్ 15-19 మధ్య సార్క్ సదస్సు సమావేశం కావాల్సిఉంది. 2016 సెప్టెంబర్ 18న జమ్ముకశ్మీర్‌లోని యురి భారత ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రవాద దాడి తర్వాత ఇస్లామాబాద్‌లో నిర్వహించే సార్క్ సదస్సుకు హాజరు కాలేమని భారత్ స్పష్టం చేసింది.

ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తున్న పాక్ నిర్వహించే సదస్సుకు హాజరు కాలేమని పేర్కొన్నది. భారత్ తర్వాత పాక్‌లో సదస్సుకు హాజరు కావడానికి బంగ్లాదేశ్, భూటాన్, ఆప్ఘనిస్థాన్ నిరాకరించాయి. గతవారం పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్.. సార్క్ సదస్సు నిర్వహణపై స్పందించారు. ఈ సదస్సు నిర్వహణకు నెలకొన్న కృత్రిమ అడ్డంకుల తొలగింపునకు మార్గంగా.. చాలా కాలంగా జాప్యమైన సార్క్ సమ్మిట్ నిర్వహించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

