NSA Ajit Doval | షేక్ హసీనాతో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ భేటీ
NSA Ajit Doval | బంగ్లాదేశ్‌లో హింస చెలరేగడంతో ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌కు చేరుకున్న షేక్ హసీనాను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, మిలిటరీకి చెందిన పలువురు ఉన్నతాధికారులు కలిశారు.
NSA Ajit Doval : బంగ్లాదేశ్‌లో హింస చెలరేగడంతో ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌కు చేరుకున్న షేక్ హసీనాను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, మిలిటరీకి చెందిన పలువురు ఉన్నతాధికారులు కలిశారు. ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌లో దిగిన హసీనాకు ధోవల్, ఆర్మీ అధికారులు రిసీవ్ చేసుకున్నారు.
షేక్ హసీనాకు భారత వైమానిక దళంతోపాటు ఇతర భద్రతా బలగాలు రక్షణ కల్పించనున్నాయి. ప్రస్తుతం ఆమెకు సురక్షితమైన ప్రాంతంలో ఆశ్రయం కల్పించినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. హిండన్ ఎయిర్‌బేస్‌లో అజిత్ ధోవల్, మిలిటరీ అధికారులతో హసీనా మాట్లాడారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో పరిస్థితి, హసీనా భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు.
బంగ్లాదేశ్‌లో పరిస్థితి నేపథ్యంలో తూర్పున ఉన్న ప్రతి సెక్టార్లో మిలిటరీ అధికారులు అలర్ట్ ప్రకటించారు. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల విషయంలో తలెత్తిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దాదాపు 300 మంది మృతిచెందారు. ఈ నేపథ్యంలో బంగ్లా మిలిటరీ సలహా మేరకు హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చారు. ఇక్కడి నుంచి ఆమె లండన్‌కు వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

