న్యూఢిల్లీ, అక్టోబర్ 2: రీల్స్ ఫీచర్ విజయవంతం తర్వాత.. సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్ ‘నోట్స్’ పేరిట మరో కొత్త తరహా ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ నోట్స్ ఫీచర్‌తో యూజర్లు 60 అక్షరాల పరిమితితో సంక్షిప్త నోట్స్‌ను క్రియేట్ చేయవచ్చు. యూజర్లు క్రియేట్ చేసే ఈ నోట్స్ తమ ఫాలోవర్లకు వారి డైరెక్ట్ మెసేజ్(డీఎం)లో కనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ మాదిరిగా ఈ నోట్స్ 24 గంటల తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతుంది. యూజర్లు క్రియేట్ చేసిన నోట్స్‌కు ఇతరుల స్పందన కూడా డైరెక్ట్ మెసేజ్ సెక్షన్లోనే కనిపిస్తుంది.