MS Swaminathan: ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత
MS Swaminathan: గ్రీన్ రెవల్యూషన్‌కు ఆద్యుడు.. ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూశారు. అత్యంత ఎక్కువ దిగుబడిని ఇచ్చే ఎన్నో వరి, గోధుమ వంగడాలను సృష్టించిన స్వామినాథన్ 98 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. ఆహార భద్రతకు పెద్దపీట వేసిన స్వామినాథన్ చిరస్మరణీయులు.
హైదరాబాద్: భారతీయ హరిత విప్లవానికి జాతిపితగా కీర్తించబడే ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్(MS Swaminathan) ఇవాళ కన్నుమూశారు. ఆయన వయసు 98 ఏళ్లు. భారతీయ వ్యవసాయ రంగంలో ఆయన అనేక విప్లవాత్మక మార్పులను సృష్టించారు. అత్యధిక స్థాయిలో దిగుబడిని ఇచ్చే అనేక వరి వంగడాలను ఆయన డెవలప్ చేశారు. తక్కువ ఆదాయం ఉన్న రైతులకు .. దిగుబడిని పెంచే అనేక పద్ధతులను ఆయన నేర్పారు.
1987లో స్వామినాథన్‌కు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డు దక్కింది. ఆ తర్వాత ఆయన చెన్నైలో ఎంఎస్ స్వామినాథన్ రీసర్చ్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. స్వామినాథన్ అనేక అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. 1971లో ఆయన రామన్ మెగస్సేసే అవార్డును సొంతం చేసుకున్నారు. 1986లో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డు ఆయన్ను వరించింది.
స్వామినాథన్‌కు భార్య మీనాతో పాటు ముగ్గురు కుమార్తెలు సౌమ్యా స్వామినాథన్, మధురా స్వామినాథన్, నిత్యా స్వామినాథన్ ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థలో సౌమ్యా స్వామినాథన్.. చీఫ్ సైంటిస్టుగా ఉన్న విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

