Not A Coffee Shop | ‘ఇది కోర్టు.. కాఫీ షాపు కాదు’.. పదే పదే ‘యా’ అన్న లాయర్‌పై సీజేఐ మండిపాటు
Not A Coffee Shop | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, ఒక లాయర్‌పై మండిపడ్డారు. ఆయన పదే పదే ‘యా’ అని అనడంపై సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది కోర్టు.. కాఫీ షాపు కాదు’ అని అన్నారు. ‘యా, యా’ అనడం తనకు ‘అలెర్జీ’గా ఉందన్నారు. ఈ భాషను కోర్టులో అనుమతించబోనని స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, ఒక లాయర్‌పై మండిపడ్డారు. ఆయన పదే పదే ‘యా’ అని అనడంపై సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది కోర్టు.. కాఫీ షాపు కాదు’ అని అన్నారు. (Not A Coffee Shop) ‘యా, యా’ అనడం తనకు ‘అలెర్జీ’గా ఉందన్నారు. ఈ భాషను కోర్టులో అనుమతించబోనని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌ను ప్రతివాదిగా 2018 నాటి పిటిషన్లో ఒక న్యాయవాది పేర్కొన్నారు. అయితే ఆర్టికల్ 32 అభ్యర్థన కిందకు ఇది వస్తుందా? మాజీ న్యాయమూర్తిని ప్రతివాదిగా పేర్కొంటూ ఎలా పిల్ దాఖలు చేస్తారు? అని సీజేఐ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు.
కాగా, ఆ న్యాయవాది స్పందిస్తూ, ‘‘యా, యా’ అప్పటి సీజేఐ రంజన్ గొగోయ్ క్యురేటివ్ ఫైల్ చేయమని నన్ను అడిగారు’ అని తెలిపారు. ఇంతలో సీజేఐ చంద్రచూడ్ కల్పించుకున్నారు. ‘ఇది కాఫీ షాప్ కాదు. యా, యా ఏమిటి. ఇది నాకు చాలా అలెర్జీగా ఉంది. ఈ వ్యక్తీకరణను కోర్టులో అనుమతించలేం’ అని అన్నారు.
మరోవైపు జస్టిస్ గొగోయ్ ఈ కోర్టు మాజీ న్యాయమూర్తి అని సీజేఐ డీవై చంద్రచూడ్ గుర్తు చేశారు. ఆయనకు వ్యతిరేకంగా ఇలాంటి పిటిషన్ దాఖలు చేయలేరని, అంతర్గత విచారణ కోరడం కుదరదని స్పష్టం చేశారు. ఈ పిటిషన్‌ను రిజిస్ట్రీ పరిశీలిస్తుందని తెలిపారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న జస్టిస్ గొగోయ్ పేరును పిటిషన్ నుంచి తొలగించాలని ఆ న్యాయవాదికి సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

