సెప్టెంబర్ 15 వరకు పద్మ అవార్డుల నామినేషన్ల స్వీకరణ

ఢిల్లీ : పద్మ అవార్డులు-2022 నామినేషన్లను 15 సెప్టెంబర్,2021 వరకు స్వీకరించనున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. పద్మ అవార్డుల నామినేషన్లు, సిఫార్సులు ఆన్లైన్లో పద్మ అవార్డుల పోర్టల్ https://padmaawards.gov.in లో మాత్రమే స్వీకరించబడతాయని పేర్కొంది.
పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి. 1954 లో పద్మ అవార్డులను స్థాపించారు. ఈ అవార్డులు ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించబడతాయి. ఈ అవార్డు ‘వర్క్ ఆఫ్ డిస్టింక్షన్’ ను గుర్తించటానికి ప్రయత్నిస్తుంది.
కళలు, సాహిత్యం, విద్య, ఆటలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, పబ్లిక్ అఫైర్స్, సివిల్ వంటి అన్ని రంగాలలో విశిష్టమైన, అసాధారణమైన విజయాలు / సేవలకు ఈ అవార్డు ఇవ్వబడుతుంది. కాగా వైద్యులు, శాస్త్రవేత్తలు తప్ప పీఎస్యులతో పనిచేసే వారితో సహా ప్రభుత్వ ఉద్యోగులు పద్మ అవార్డులకు అర్హులు కాదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

