Watch: తప్పిపోయిన కుక్క పోస్టర్ తొలగించినందుకు.. సొసైటీ ప్రెసిడెంట్‌ను కొట్టిన మహిళ
Noida Woman Slaps Society President | తప్పిపోయిన కుక్క పోస్టర్ తొలగించినందుకు హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్‌ను ఒక మహిళ కొట్టింది. (Noida Woman Slaps Society President) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది.
లక్నో: తప్పిపోయిన కుక్క పోస్టర్ తొలగించినందుకు హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్‌ను ఒక మహిళ కొట్టింది. (Noida Woman Slaps Society President) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. సెక్టార్ 75లోని ఎయిమ్స్ గోల్ఫ్ అవెన్యూ సొసైటీలో నివసిస్తున్న ఆషి సింగ్ పెంపుడు కుక్క తప్పిపోయింది. ఈ నేపథ్యంలో కుక్క మిస్సింగ్ పోస్టర్‌ను ఆ సొసైటీ ప్రాంగణంలో అంటించారు.
కాగా, ఆ సొసైటీ అధ్యక్షుడు నవీన్ మిశ్రా ఈ పోస్టర్‌ను తొలగించాడు. శుక్రవారం ఆషి సింగ్ దీని గురించి అతడ్ని నిలదీసింది. నవీన్ మిశ్రా కాలర్ పట్టుకొన్న ఆమె అతడితో ఘర్షణకు దిగింది. ‘సుప్రీంకోర్టు కంటే అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ పెద్దదా?’ అని ప్రశ్నించింది. అయితే తన కాలర్‌ను విడిచిపెట్టాలని నవీన్ ఆమెను కోరాడు. అలాగే మర్యాదగా మాట్లాడాలని అన్నాడు. దీంతో ఆషి సింగ్ రెచ్చిపోయింది. నవీన్ జుట్టుపట్టుకుని అతడి చెంపపై కొట్టింది. ఇంతలో అక్కడున్న కొందరు వ్యక్తులు జోక్యం చేసుకుని విడిపించారు.
మరోవైపు బీజేపీకి చెందిన నవీన్ మిశ్రా ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక వ్యక్తి మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ మరో వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అసభ్యంగా ప్రవర్తించినందుకు బీజేపీ నేతను ఆమె కొట్టినట్లు ఆరోపించింది.
नोएडा:-
यह है नोएडा की सोसाइटी का हाल, सोसाइटी के प्रेसिडेंट व महिला के बीच मिसिंग कुत्ते के पोस्टर को लेकर हुआ विवाद, खूब हुई गाली-गलौज, वीडियो हुआ वायरल।PS 113@Uppolice @noidapolice @CP_Noida @SaharaSamayUP pic.twitter.com/l6wRrpfYSh— Journalist Amar Saini (@AmarSai91829221) September 23, 2023
नोएडा की सोसायटियों से आए दिन भाजपा नेताओं के गुंडागर्दी की वीडियो सामने आती हैं।
बताया जा रहा है कि AIMS Golf Avenue 1 सोसायटी में भाजपा नेता नवीन मिश्रा ने महिला के साथ अभद्रता की, उसका हाथ पकड़ा लेकिन नोएडा पुलिस ने उल्टा महिला पर ही FIR दर्ज कर दिया।
नोएडा के श्रीकांत… pic.twitter.com/zuWHGLlmoU
— UP Congress (@INCUttarPradesh) September 23, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

