Arrest | 30 ఏళ్ల నాటి కేసులో కాశ్మీరీ వేర్పాటువాది అరెస్ట్.. ట్రాన్సిట్ రిమాండ్ విధించిన కోర్టు
Arrest | ముప్పయ్యేళ్ల నాటి కేసులో కాశ్మీరీ వేర్పాటువాది షబ్బీర్ అహ్మద్ షా అరెస్టయ్యాడు. ఎన్ఐఏ అధికారులు అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని పటియాలా హౌస్ కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు అతనికి మూడు రోజుల ట్రాన్సిట్ రిమాండ్ విధించింది.
Arrest : ముప్పయ్యేళ్ల నాటి కేసులో కాశ్మీరీ వేర్పాటువాది షబ్బీర్ అహ్మద్ షా (Shabbir Ahmed Shah) అరెస్టయ్యాడు. ఎన్ఐఏ అధికారులు (NIA officials) అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని పటియాలా హౌస్ కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు అతనికి మూడు రోజుల ట్రాన్సిట్ రిమాండ్ (Transit remand) విధించింది. రిమాండ్ ముగిసిన తర్వాత సోమవారం మధ్యాహ్నం 12 గంటలలోపు కశ్మీర్‌లోని ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ముందు హాజరుపర్చాలని న్యాయమూర్తి ఎన్ఐఏ అధికారులను ఆదేశించారు.
షబ్బీర్ అహ్మద్ షాపై 1996 జూలై 17న కేసు నమోదైంది. అయితే అప్పటి నుంచి నిందితుడు పోలీసులకు చిక్కుకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. దాంతో కేసు మరుగున పడిపోయింది. అయితే ఈ నెల 1న ఎన్ఐఏ అధికారులు కేసును తిరిగి తెరిచారు. ఆపై నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 1996 జూలై 17న భద్రతాబలగాల ఎన్కౌంటర్లో హతమైన ఉగ్రవాది అంత్యక్రియలు జరిగాయి.
ఈ అంత్యక్రియల సందర్భంగా కాశ్మీరీ వేర్పాటువాదులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. భద్రతాబలగాలపై కాల్పులు జరిపారు. బాంబులు విసిరి శాంతిభద్రతలకు విఘాతం కలిగించారు. పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. దాంతో షబ్బీర్‌తోపాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి. మిగతావాళ్లు అరెస్టయినా షబ్బీర్ తప్పించుకుతిరుగుతున్నాడు. తాజాగా అతడు కూడా దర్యాప్తు అధికారులకు చిక్కాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

