క్యాంపస్‌లో లైంగిక వేధింపులు.. ఏడుగురిపై టీసీఎస్ వేటు
టీసీఎస్ నాసిక్ క్యాంపస్‌లో ఉద్యోగులపై లైంగిక వేధింపులు, మతమార్పిళ్ల వ్యవహారం సంచలనంగా మారింది. హెచ్ఆర్ మేనేజర్ సహా ఏడుగురు ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై టీసీఎస్ స్పందిస్తూ.. అరెస్ట్ అయిన ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది.
నాసిక్ : టీసీఎస్ నాసిక్ క్యాంపస్‌లో ఉద్యోగులపై లైంగిక వేధింపులు, మతమార్పిళ్ల వ్యవహారం సంచలనంగా మారింది. హెచ్ఆర్ మేనేజర్ సహా ఏడుగురు ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై టీసీఎస్ స్పందిస్తూ.. అరెస్ట్ అయిన ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. పనిప్రదేశంలో వేధింపులను సహించబోమని తెలిపింది. పెండ్లి పేరుతో తనను మోసం చేశాడని నాసిక్ క్యాంపస్‌లోని ఓ ఉద్యోగిని సహ ఉద్యోగిపై ఫిర్యాదు చేశారు.
తర్వాత మరో ఏడుగురు మహిళలు కూడా తమపై వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ క్రమంలో పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ నిర్వహించారు. ఏడుగురు మహిళా పోలీసులు మారువేషంలో టీసీఎస్ క్యాంపస్‌లోకి ప్రవేశించారు. మహిళా ఉద్యోగి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ ఉద్యోగిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మిగిలిన నిందితులపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

