సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహిరి కన్నుమూత
Bappi Lahiri | ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహరి కన్నుమూశారు. 69 ఏండ్ల బప్పి లహరి ముంబైలోని దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ముంబై: ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహిరి కన్నుమూశారు. 69 ఏండ్ల బప్పి లహిరి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ముంబైలోని ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఒంటినిండా బంగారంతో ప్రత్యేకంగా కనిపించే బప్పి.. 1980, 90వ దశకాల్లో తన డిస్కో మ్యూజిక్‌తో భారతీయ సినీపరిశ్రమను ఒక ఊపుఊపేశారు. ఆయన సంగీత దర్శకత్వం వహించిన చల్తే చల్తే, డిస్కో డ్యాన్సర్, షరాబీ వంటి పలుచిత్రాలు సూపర్‌హిట్‌గా నిలిచాయి.

బప్పి లహిరి 1952, నవంబర్ 27న బెంగాల్‌లోని జల్పాయ్గురిలో జన్మించారు. ఆయన హిందీతోపాటు తెలుగు, తమిళ, కన్నడ, గుజరాతీ భాషల్లో సంగీతం అందించారు. 2014లో భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరిన ఆయన అదేఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బెంగాల్ నుంచి ఎంపీగా పోటీచేశారు.
బప్పి లహిరి తెలుగులో కూడా ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. సింహాసనం, స్టేట్ రౌడీ, సామ్రాట్, గ్యాంగ్ లీడర్, రౌడీగారిపెళ్లాం, దొంగ పోలీసు, బ్రహ్మ, నిప్పురవ్వ, బిగ్‌బాస్, ఖైదీ ఇన్స్పెక్టర్ వంటి విజయవంతమైన చిత్రాలకు ఆయన మ్యూజిక్ అందిచారు. తెలుగులో ఇటీవల డిస్కోరాజా చిత్రంలో కూడా పాటపడారు. కాగా, హిందీలో 2020లో విడుదలైన బాఘీ 3 సినిమాలో తన చివరి పాట పాడారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

