Drug Case | వాట్సాప్లో డ్రగ్స్ గురించి సంభాషణే జరగలేదు: అర్బాజ్ తండ్రి వివరణ
Drug Case | డ్రగ్స్ కేసులో అరెస్టయిన స్టార్ కిడ్ ఆర్యన్ స్నేహితుడు, ఎన్సీబీ కస్టడీలో ఉన్న అర్బాజ్ మర్చంట్ తండ్రి ఈ కేసుపై నోరువిప్పారు. అర్బాజ్, ఆర్యన్ ఇద్దరూ క్రూయిజ్ నౌకలో

ముంబై: డ్రగ్స్ కేసులో అరెస్టయిన స్టార్ కిడ్ ఆర్యన్ స్నేహితుడు, ఎన్సీబీ కస్టడీలో ఉన్న అర్బాజ్ మర్చంట్ తండ్రి ఈ కేసుపై నోరువిప్పారు. అర్బాజ్, ఆర్యన్ ఇద్దరూ క్రూయిజ్ నౌకలో జరిగిన పార్టీకి ఆహ్వానితులని ఆయన అస్లామ్ మర్చంట్ చెప్పారు. స్వతహాగా లాయర్ అయిన తనకు న్యాయవ్యవస్థపై నమ్మకముందని అన్నారు. పార్టీకి వెళ్లాలా? వద్దా? అని ఆ స్నేహితులిద్దరూ వాట్సాప్లో చాట్ చేసుకున్నారని, అంతేగానీ డ్రగ్స్ గురించి అసలు సంభాషణే జరగలేదని వివరించారు.
తమ పిల్లలపై వస్తున్న డ్రగ్స్ ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేశారు. అర్బాజ్ తనతో బ్రేక్ఫాస్ట్ చేశాడని, డిన్నర్ కూడా చేయాల్సి ఉందని తెలిపారు. చివరి నిమిషంలో పార్టీకి వెళ్లాలని అర్బాజ్, ఆర్యన్ నిర్ణయించుకున్నారని చెప్పారు. నార్కొటిక్స్ బ్యూరో అధికారులకు నౌకలో డ్రగ్స్ దొరికాయని, అయితే అర్బాజ్, ఆర్యన్ ఇద్దరూ అసలు నౌకలోకే వెళ్లలేదని పేర్కొన్నారు. ఎన్సీబీ అధికారులు కూడా తమతో, పిల్లలతో చాలా మర్యాదగా ప్రవర్తిస్తున్నారని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

