Apology | ‘ఆవేశంలో మాట్లాడా.. నన్ను క్షమించండి’.. లడఖ్ ‘వీ ఆర్ జెన్ జీ’ యువతి..!
Apology | లడఖ్ (Ladakh) లో 'వీ ఆర్ జెన్ జీ' అంటూ భారత సైనికుల (Indian Soldiers) తో వాగ్వాదానికి దిగి, సోషల్ మీడియా (Social Media) లో తీవ్ర విమర్శల పాలైన యువతి తాజాగా బహిరంగ క్షమాపణలు కోరింది. ఆవేశంలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు పశ్చాత్తాపం వ్యక్తంచేస్తూ, భారత సైన్యం, జమ్మూకశ్మీర్, లడఖ్ పోలీసులకు ఆమె క్షమాపణలు తెలిపింది.
Apology : లడఖ్ (Ladakh) లో ‘వీ ఆర్ జెన్ జీ’ అంటూ భారత సైనికుల (Indian Soldiers) తో వాగ్వాదానికి దిగి, సోషల్ మీడియా (Social Media) లో తీవ్ర విమర్శల పాలైన యువతి తాజాగా బహిరంగ క్షమాపణలు కోరింది. ఆవేశంలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు పశ్చాత్తాపం వ్యక్తంచేస్తూ, భారత సైన్యం, జమ్మూకశ్మీర్, లడఖ్ పోలీసులకు ఆమె క్షమాపణలు తెలిపింది. సదరు వీడియో వైరల్ అయిన అనంతరం తొలిసారిగా ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో ఆమె ఈ మేరకు స్పందించింది.
లడఖ్ నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న క్రమంలో కార్గిల్ విజయ్ దివస్ (జులై 26) ను పురస్కరించుకుని ఏర్పాటుచేసిన వీఐపీ భద్రత దృష్ట్యా ద్రాస్ ప్రాంతంలోని మినీమార్గ్ చెక్‌పోస్ట్ వద్ద తమ వాహనాలను నిలిపివేసినట్లు ఆ 25 ఏళ్ల యువతి వివరణ ఇచ్చింది. సుమారు ఆరు గంటలపాటు నిరీక్షించాల్సి రావడం, అధికారుల నుంచి సరైన సమాచారం లేకపోవడంతో సహనం కోల్పోయి ఆగ్రహం వ్యక్తం చేశానని తెలిపింది. ఆవేశంలో తాను చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమర్థనీయం కావని, అది ముమ్మాటికీ తప్పేనని ఆమె అంగీకరించింది.
పరిసరాల్లో ఉన్న వ్యక్తులు రెచ్చగొట్టడంతో అప్రయత్నంగానే ‘జెన్ జీ’ అనే పదం వాడానని, అంతకుమించి తనకు మరే ఇతర ఉద్దేశం లేదని ఆమె స్పష్టంచేసింది. ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో ఎదురైన ట్రోలింగ్ తనను తీవ్ర మనోవేదనకు గురిచేసిందని, మానసిక ఒత్తిడికి లోనయ్యానని ఆవేదన వ్యక్తంచేసింది. ‘ఈ వేదిక ద్వారా దేశ ప్రజలకు, భారత సైన్యానికి, జమ్మూకశ్మీర్, లడఖ్ పోలీసులకు, ముఖ్యంగా ఒమర్ అబ్దుల్లాకు మరోసారి క్షమాపణలు చెబుతున్నా. నా ప్రవర్తన వల్ల ఇంతమంది మనస్తాపానికి గురికావడం నన్ను సిగ్గుపడేలా చేస్తోంది’ అని ఆమె పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mailurayi | నాగబాబు చేతుల మీదుగా ‘మైలురాయి’ టైటిల్ లాంచ్.. నిర్మాతగా శ్రీ హన్సిక!
KTR | రాష్ట్రం కరువులో ఉంటది.. కానీ సుందరీకరణ మాత్రం ఆగదు : కేటీఆర్
Spain Train Crash: డ్రైవర్లు, కంట్రోల్ సెంటర్ మధ్య సంభాషణ.. ఆడియో రిలీజ్ చేసిన స్పానిష్ మీడియా
Anirudh – Kaviya | అనిరుధ్ – కావ్య మారన్ రిసెప్షన్.. ప్రధాని, సీఎం విజయ్ సహా ప్రముఖులకు ఆహ్వానం!
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

