MANIPUR| ‘మణిపూర్ ఫైల్స్’ పేరుతోనూ సినిమా తీయాలి.. కేంద్రం, మణిపూర్ సర్కార్లపై ఉద్ధవ్ ధ్వజం
ముంబై: మణిపూర్ హింసాకాండపై కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలపై శివసేన (యూబీటీ) అధినేత, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మణిపూర్‌లో దారుణాలపై ‘మణిపూర్ ఫైల్స్’ సినిమా తీయాలన్నారు.
ముంబై: మణిపూర్ హింసాకాండపై కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలపై శివసేన (యూబీటీ) అధినేత, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మణిపూర్‌లో దారుణాలపై ‘మణిపూర్ ఫైల్స్’ సినిమా తీయాలన్నారు. కశ్మీర్లో కంటే మణిపూర్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో బయటకు రావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. రాజకీయంగానూ ఇది దుమారం రేపుతున్నది. పార్లమెంట్లో ఈ విషయంపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుబడుతున్నాయి.
మణిపూర్ ఘటనను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోకపోయి ఉంటే, ప్రధాని మోదీ నోరు మెదిపేవారు కాదని శివసేన తమ పార్టీ పత్రిక సామ్నాలో విమర్శించింది. ది కశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరి పేరుతో సినిమాలు తీశారని, ఇప్పుడు వారు మణిపూర్ ఫైల్స్ పేరుతో సినిమా తీయాలని సూచించింది. మణిపూర్‌లో కనుక బీజేపీయేత ప్రభుత్వం ఉండుంటే ఇప్పుటికి ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసేవారని వ్యాఖ్యానించింది. రాజకీయ పరంగా ప్రధాని మోదీకి మణిపూర్‌తో పెద్దగా ప్రయోజనం లేదని, అందుకే అక్కడి ఘర్షణలను ఆయన పట్టించుకోలేదని ఆరోపించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

