మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనలో పోలీసుల కస్టడీకి ఒరెవా గ్రూప్ ఎండీ
గుజరాత్లో మోర్బీ వంతెన కూలిన కేసులో నిందితుడైన ఒరెవా గ్రూప్‌నకు చెందిన జైసుఖ్ పటేల్‌ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. మోర్బీ కోర్టు అరెస్టు వారెంటు జారీయేయడంతో ఆయన న్యాయస్థానం ముందు లొంగిపోయారు.
Morbi Bridge | గుజరాత్లో మోర్బీ వంతెన కూలిన కేసులో నిందితుడైన ఒరెవా గ్రూప్‌నకు చెందిన జైసుఖ్ పటేల్‌ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. మోర్బీ కోర్టు అరెస్టు వారెంటు జారీయేయడంతో ఆయన న్యాయస్థానం ముందు లొంగిపోయారు. విచారణ నిమిత్తం వారం రోజులపాటు పోలీసు కస్టడీకి కోర్టు అనుమించింది. దీంతో పోలీసులు ఆయనను తమ ఆదీనంలోకి తీసుకున్నారు. గతేడాది అక్టోబర్ 30న మోర్బీ వంతెన కూలిపోయిన ప్రమాదంలో 135 మంది మరణించారు. అప్పటినుంచి ప్రధాన నిందితుడైన జైసుఖ్ పటేల్ పరారీలో ఉన్నారు.
ఈ కేసులో గుజరాత్ పోలీసులు 1262 పేజీల చార్జ్ షీట్ దాఖలు చేశారు. జైసుఖ్ పటేల్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. జనవరి 24న గుజరాత్ కోర్టు పటేల్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అక్టోబర్‌లో సంఘటన జరిగినప్పటి నుంచి జైసుఖ్ పటేల్ కనిపించకుండా పోయారని, చార్జిషీట్లో ‘పరారీ’గా పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఒరేవా గ్రూప్‌కు చెందిన నలుగురు ఉద్యోగులతో పాటు తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ నిందితుడు ఈ నెల 20 న మోర్బీ సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ హాజరుకాకపోవడంతో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వచ్చే నెల 1 వ తేదీకి వాయిదా పడింది.
బ్రిటీష్ కాలం నాటి వంతెన నిర్వహణ బాధ్యతను ఎలాంటి గత అనుభవం లేని ఒరెవా గ్రూప్‌నకు గుజరాత్ ప్రభుత్వం అప్పగించడంపై సర్వత్రా విమర్శలు చెలరేగాయి. వంతెనపైకి వెళ్లే వ్యక్తుల సంఖ్యపై పరిమితి లేకపోవడం, టిక్కెట్ల విక్రయంపై నియంత్రణ లేకపోవడం వంటి కారణాలతో వంతెన నియంత్రణ కోల్పోయిందని వంతెన కుప్పకూలడానికి దారితీసిన అంశాలను ప్రత్యేక దర్యాప్తు బృందం తమ ఛార్జిషీట్లో పేర్కొన్నది. అలాగే, నిపుణుల సంప్రదింపులు లేకుండానే మరమ్మతులు చేయడం వంటి లోపాల వల్ల కూలిందని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

