న్యూఢిల్లీ: చంద్రుడి ఆవిర్భావం గురించి తాజా పరిశోధన సరికొత్త విషయాన్ని బయటపెట్టింది. చంద్రుడి వయసు మనం ఊహించినదాని కన్నా 4 కోట్ల సంవత్సరాలు ఎక్కువగా ఉందని ఫీల్డ్ మ్యూజియం, గ్లాస్గో వర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. 1972లో అపోలో వ్యోమగాములు చంద్రుడిపై నుంచి తీసుకొచ్చిన రాళ్లపై ప్రయోగాలు జరిపిన పరిశోధకులు ఈ విషయాన్ని తెలిపారు. సౌర కుటుంబంలో మార్స్ పరిమాణంలో ఉన్న ఖగోళ వస్తువు 442 కోట్ల సంవత్సరాల క్రితం భూమిని ఢీకొనగా, భూమి నుంచి చంద్రుడు ఏర్పడ్డాడన్నది ఇప్పటివరకు ఉన్న అంచనా. ‘ఖగోళ వస్తువు ఢీకొన్నప్పుడు ఆ వేడికి రాళ్లు కరిగి.. స్పటికాలుగా ఏర్పడ్డాయి. చంద్రుడిపై లభించిన జిర్కాన్ స్పటికాలు ఇలా ఏర్పడ్డవే’ అని ప్రొఫెసర్ ఫిలిప్ హెక్ అన్నారు. దీనిని బట్టి చంద్రుడు వయసు 442 కోట్ల ఏండ్లు కాదు.. 446 కోట్ల సంవత్సరాలు ఉంటుందని సైంటిస్టులు అంచనావేశారు.