Mobile Internet | పరీక్షల్లో అక్రమాల భయం.. ఆ రాష్ట్రంలో మొబైల్ ఇంటర్నెట్ బంద్
శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు పుకార్లు వ్యాపించకుండా మొబైల్ ఇంటర్నెట్ను బంద్ చేయడం గురించి చాలాసార్లు విన్నాం. కానీ, జార్ఖండ్ ప్రభుత్వం మాత్రం పరీక్షల్లో అక్రమాల భయంతో మొబైల్ ఇంటర్నెట్ను ఆపేయాలని నిర్ణయించింది.
- జార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయం
Mobile Internet | రాంచి, సెప్టెంబర్ 21: శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు పుకార్లు వ్యాపించకుండా మొబైల్ ఇంటర్నెట్ను బంద్ చేయడం గురించి చాలాసార్లు విన్నాం. కానీ, జార్ఖండ్ ప్రభుత్వం మాత్రం పరీక్షల్లో అక్రమాల భయంతో మొబైల్ ఇంటర్నెట్ను ఆపేయాలని నిర్ణయించింది. పరీక్షల కోసం ఇలాంటి ముందు జాగ్రత్త చర్య తీసుకోవడం బహుశా దేశంలో ఇదే మొదటిసారి.
జార్ఖండ్ జనరల్ గ్రాడ్యుయేట్ లెవెల్ కంబైన్డ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్(జేజీజీఎల్సీసీఈ) పరీక్షలు శనివారం, ఆదివారాల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పరీక్ష జరిగే రెండు రోజులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మొబైల్ ఇంటర్నెట్ను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఫేస్బుక్, వాట్సాప్, ఎక్స్, టెలిగ్రామ్, ట్విట్టర్ వంటి మొబైల్ యాప్‌లను ఉపయోగించి గతంలో కొందరు అక్రమాలకు పాల్పడ్డట్టు గుర్తించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని కోర్ట్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

