Mark Zuckerberg: ఎన్నికలపై జుకర్‌బర్గ్ కామెంట్.. భారత్‌కు క్షమాపణలు చెప్పిన మెటా సంస్థ
Mark Zuckerberg: ఇండియాకు మెటా సంస్థ సారీ చెప్పింది. కోవిడ్ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వాలు కూలినట్లు ఇటీవల జుకర్‌బర్గ్ వ్యాఖ్యానించారు. ఇండియా కూడా ఆ లిస్టులో ఉన్నట్లు పేర్కొన్నారు. కానీ జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలు నిజం కాదు అని మెటా సంస్థ ఇవాళ తెలిపింది.
న్యూఢిల్లీ: భారతీయ ఎన్నికలపై కామెంట్ చేసిన ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్(Mark Zuckerberg) తరపున మెటా సంస్థ క్షమాపణలు చెప్పింది. కోవిడ్19 సమయంలో సరైన రీతిలో చర్యలు తీసుకోని ప్రభుత్వాలు కూలినట్లు జుకర్‌బర్గ్ ఇటీవల కామెంట్ చేశారు. అయితే ఆ దేశాల్లో భారత్ కూడా ఉన్నట్లు జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యల పట్ల మెటా సంస్థ ఇవాళ సారీ చెప్పింది. మెటా ఇండియా పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ శివనాథ్ తూక్రల్ తన ఎక్స్ అకౌంట్లో జుకర్‌బర్గ్ తరపున క్షమాపణలు చెప్పారు.
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఆ సారీ స్టేట్మెంట్ను ట్యాగ్ చేశారాయన. కోవిడ్ తర్వాత అనేక దేశాల్లో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీలు ఓటమి చవిచూశాయన్న విషయం అనేక దేశాల్లో నిజమైందని, కానీ ఇండియా విషయంలో అది నిజం కాలేదన్నారు. ఆ తప్పు పట్ల తాము క్షమాపణలు చెబుతున్నట్లు వెల్లడించారు. మెటా సంస్థకు ఇండియా చాలా కీలకమైన దేశమని పేర్కొన్నారు.
మరో వైపు మెటా సంస్థకు సమ్మన్లు జారీ చేయనున్నట్లు ఐటీ, కమ్యూనికేషన్స్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ నిశికాంత్ దూబే తెలిపారు. కోవిడ్ తర్వాత సుమారు 20 దేశాల్లో ఆయా పార్టీలు అధికారాన్ని కోల్పోయాయి. కానీ ఇండియాలో మాత్రం అలా జరగలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

