Gender Reassignment | కేంద్రం కొత్త నిబంధన.. ఇకపై లింగ మార్పిడికి మానసిక ఆరోగ్య ధ్రువీకరణ తప్పనిసరి
ఇకపై ఇష్టారీతిన లింగమార్పిడి చేయించుకోవడం కుదరదు. లింగమార్పిడి, ప్రీ-హార్మోనల్ థెరపీకి ముందు మానసిక ఆరోగ్య నిపుణుల నుంచి అవసరమైన ధ్రువీకరణ పత్రాలను పొందాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్వోపీ) విడుదల చేసింది.
Gender Reassignment | న్యూఢిల్లీ: ఇకపై ఇష్టారీతిన లింగమార్పిడి చేయించుకోవడం కుదరదు. లింగమార్పిడి, ప్రీ-హార్మోనల్ థెరపీకి ముందు మానసిక ఆరోగ్య నిపుణుల నుంచి అవసరమైన ధ్రువీకరణ పత్రాలను పొందాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్వోపీ) విడుదల చేసింది. ఎవరైనా ట్రాన్స్‌జెండర్ 18 ఏండ్ల లోపు లింగ నిర్ధారిత సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది. అంతకుముందు ఏడాదిపాటు ఎండ్రోక్రైన్ చికిత్సపై స్థిరంగా ఉన్నట్టు సర్టిఫికెట్ తీసుకోవాలి.
ఈ మేరకు గైనకాలజిస్టులు, సైకాలజీ/సైకియాట్రిస్టులకు కూడా కొన్ని సూచలను చేసింది. సర్జరీ తర్వాత ఆ వ్యక్తి ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, పేషెంట్ పేరు, సర్వనామం పరంగా ఎలా సంబోధించాలనుకుంటున్నాడు వంటివి అర్థం చేసుకోవాల్సి ఉంటుందని గైనకాలజిస్టులకు సూచించింది. అలాగే, ఎండోక్రినాలజీ పరీక్షకు ముందు సైకియాట్రిస్ట్ నుంచి ఒక సర్టిఫికెట్, లింగ నిర్ధారణ సర్జరీకి ముందు క్లినికల్ సైకాలజిస్ట్/సైకియాట్రిస్ట్ నుంచి మరో సర్టిఫికెట్‌ను ట్రాన్స్జెండర్లు సమర్పించాల్సి ఉంటుంది. వీరు పేషెంట్ మానసిక ఆరోగ్యాన్ని పరీక్షించి సర్టిఫికెట్ అందజేస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

