‘అలాంటి పురుషులే’ మహిళలను హిజాబ్ ధరించమంటారు: బీజేపీ మంత్రి అనిల్ విజ్
బీజేపీ పాలిత హర్యానా రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తమను తాము నిగ్రహించుకోలేని పురుషులే హిజాబ్ ధరించమని మహిళలను బలవంతం చేస్తారని అన్నారు.
చండీగఢ్: హిజాబ్ అంశంపై సుప్రీంకోర్టు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై మళ్లీ అగ్గి రాజేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. బీజేపీ పాలిత హర్యానా రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తమను తాము నిగ్రహించుకోలేని పురుషులే హిజాబ్ ధరించమని మహిళలను బలవంతం చేస్తారని అన్నారు. ఈ మేరకు గురువారం ఒక ట్వీట్ చేశారు. ‘స్త్రీలను చూడగానే ఉద్వేగాన్ని అదుపు చేసుకోలేని పురుషులు హిజాబ్ ధరించమని మహిళలను బలవంతం చేస్తారు. వారి మనస్సును దృఢపరచుకోవడం అవసరం. కానీ స్త్రీలకు శిక్ష విధిస్తున్నారు. తల నుంచి కాలి వరకు కప్పుకోవాలని స్త్రీలను బలవంతం చేస్తున్నారు. ఇది తీవ్ర అన్యాయం’ అని హిందీలో ట్వీట్ చేశారు. పురుషులు తమ మనస్సులను దృఢపరచుకోవాలని, మహిళలను హిజాబ్ నుంచి విముక్తి చేయాలని ఆయన సూచించారు.
కాగా, బీజేపీ పాలిత కర్ణాటకలో స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థినులు హిజాబ్ ధరించడాన్ని నిషేధించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ముస్లిం బాలికలు, యువతులు వ్యతిరేకించారు. దీనిపై ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. కర్ణాటక విద్యా సంస్థల్లో హిజాబ్ ధారణపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని తొలగించేందుకు ఆ రాష్ట్ర హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఈ తీర్పును సుప్రీంకోర్టులో పలువురు సవాల్ చేశారు.
అయితే హిజాబ్ ధారణపై అత్యున్నత న్యాయస్థానం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. ఈ పిటిషన్లపై విచారణకు సముచితమైన ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరింది. ఈ పరిణామాల నేపథ్యంలో కర్ణాటకలో మరోసారి విద్యా సంస్థల వద్ద భద్రతను పెంచారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లి మండల గిరిజన బిడ్డలకు కాకతీయ యూనివర్సిటీ గోల్డ్ మెడల్స్
Deepam lit atop Deepathoon | తిరుపరంకుండ్రం కొండపైన రాతి స్తంభంపై.. ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం
Kaaka | సస్పెన్స్‌కు ఫుల్స్టాప్.. చిరంజీవి ‘కాకా’ను రిలీజ్ చేస్తుందెవరో తెలుసా..?
‘ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి’
IAS Transfers | రాష్ట్రంలో ఎనిమిది మంది ఐఏఎస్‌ల బదిలీ.. ప్రత్యేక అధికారిగా సర్పరాజ్ నియామకం
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

