Bharat Nyay Yatra | రాహుల్ భారత్ న్యాయ్ యాత్రకు అనుమతి నిరాకరణ : వేదిక మార్పునకు కాంగ్రెస్ నిర్ణయం
Bharat Nyay Yatra : మణిపూర్ నుంచి ముంబై వరకూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ న్యాయ్ యాత్రకు ఆదిలోనే ఆటంకాలు ఎదురయ్యాయి.
Bharat Nyay Yatra : మణిపూర్ నుంచి ముంబై వరకూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ న్యాయ్ యాత్రకు ఆదిలోనే ఆటంకాలు ఎదురయ్యాయి. ఇంఫాల్ తూర్పు జిల్లా హట్టా కంగ్జిబుంగ్ నుంచి ఈ యాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా మణిపూర్ ప్రభుత్వం బుధవారం యాత్రకు అనుమతి నిరాకరించింది. జనవరి 14 నుంచి రాహుల్ భారత్ న్యాయ్ యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది.
ఈ యాత్రకు అనుమతి కోసం మణిపూర్ కాంగ్రెస్ కమిటీ చీఫ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కే. మేఘచంద్ర పార్టీ నేతలతో కలిసి సీఎం ఎన్. బీరెన్ సింగ్‌తో బుధవారం ఉదయం సమావేశమయ్యారు. రాహుల్ యాత్రకు అనుమతి ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ నేతలు సీఎంకు విజ్ఞప్తి చేశారు. అయితే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్ధితి కారణంగ యాత్రకు తమ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలకు సీఎం తెలిపారు.
మణిపూర్ ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో ప్రభుత్వ నిర్ణయం దురదృష్టకరమని మేఘచంద్ర అభివర్ణించారు. అనుమతి నిరాకరించడంతో తౌబల్ జిల్లాలోని ఖోంగ్జాంలోని ఓ ప్రైవేట్ స్ధలానికి వేదికను మార్చామని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. ఇక 14 రాష్ట్రాలు, 85 జిల్లాల మీదుగా సాగే ఈ యాత్రను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే జెండా ఊపి ప్రారంభించనున్నారు. వాహనాలతో పాటు పాదయాత్రగా భారత్ న్యాయ యాత్ర సాగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Read More :
Ayodhya | వెండి ఉంగరంపై అయోధ్య నమూనా.. డిజైన్ చేసిన ఆభరణాల వ్యాపారి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

