Air Hostess Murder: ఎయిర్ హోస్టెస్‌ను చంపిన వ్యక్తి.. జైలులో ఆత్మహత్య
air hostess murder: ఎయిర్ హోస్టెస్ రూపల్ ఓగ్రేను హత్య చేసిన విక్రమ్ అత్వాల్ జైలులో ఉరివేసుకున్నాడు. రూపల్ ఓగ్రే ఇంట్లో నిందితుడు విక్రమ్ పనిమనిషిగా చేశాడు. తన ప్యాంట్‌తోనే జైలు గదిలో ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ముంబై: ఎయిర్ హోస్ట్(Air Hostess)గా శిక్షణ పొందుతున్న రూపల్ ఓగ్రేను విక్రమ్ అత్వాల్ అనే వ్యక్తి హత్య(Murder) చేసిన విషయం తెలిసిందే. అంధేరిలో ఉన్న ఫ్లాట్‌లో ఆమెను అతను మర్డర్ చేశాడు. ఆ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న విక్రమ్.. తాను ఉంటున్న జైలులోనే ఉరివేసుకున్నాడు. రూపల్ ఓగ్రే ఇంట్లో నిందితుడు విక్రమ్ పనిమనిషి చేశాడు. తన ప్యాంట్‌తోనే జైలు గదిలో ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చత్తీస్‌ఘడ్‌కు చెందిన రూపల్ తన అంధేరి ఫ్లాట్‌లో సెప్టెంబర్ 3వ తేదీన శవమై తేలింది. ఆమె గొంతు కోసి ఉంది.
ఓ ప్రైవేటు ఎయిర్‌లైన్ సంస్థలో శిక్షణ కోసం ఆమె ముంబైకి వెళ్లింది. ఏడాది కాలం నుంచి విక్రమ్ అత్వాల్.. రూపల్ ఓగ్రే ఇంట్లోనే హౌజ్‌కీపింగ్ పనిచేస్తున్నాడు. ఇంటిని శుభ్రం చేస్తానని చెప్పి ప్రవేశించిన అతను.. ఆ తర్వాత రేప్‌కు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కానీ రూపాల్ తీవ్రంగా పోరాడింది. బాధితురాలి గొంతు కోసిన విక్రమ్ ఆమె శరీరాన్ని బాత్రూమ్లో పడేశాడు. దుస్తులు మార్చుకుని అతను అక్కడ నుంచి పారిపోయాడు.
సీసీటీవీ కెమెరాలకు ఆ నిందితుడు చిక్కాడు. మధ్యాహ్నం 11.30 నిమిషాల నుంచి 1.30 నిమిషాల వరకు ఓగ్రే ఫ్లాట్‌లోనే అత్వాల్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఓగ్రే ఎంతకీ ఫోన్ తీయకపోవడంతో.. కీమేకర్ ద్వారా ఇంటి డోర్ తీశారు. రక్తపు మడుగులో ఓగ్రే శరీరాన్ని గుర్తించారు. మర్డర్‌కు వాడిన కత్తి, నిందితుడి దుస్తుల్ని హౌజింగ్ సొసైటీ సమీపంలో ఉన్న పొదల్లో రికవరీ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

