Watch: కారు బానెట్‌పై వేలాడిన వ్యక్తి.. మూడు కిలోమీటర్లు నడిపిన డ్రైవర్
Man dragged on car's bonnet | ఒక వ్యక్తి కారు బానెట్‌పై ప్రమాదకరంగా వేలాడాడు. పట్టించుకోని డ్రైవర్ మూడు కిలోమీటర్ల దూరం వరకు డ్రైవ్ చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: ఒక వ్యక్తి కారు బానెట్‌పై ప్రమాదకరంగా వేలాడాడు. పట్టించుకోని డ్రైవర్ మూడు కిలోమీటర్ల దూరం వరకు డ్రైవ్ చేశాడు. (Man dragged on car’s bonnet) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. శనివారం మధ్యాహ్నం రెండు కార్లు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో కారును నిలిపేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అయితే డ్రైవర్ కారును నడపడంతో ఆ వ్యక్తి బానెట్‌పై పడ్డాడు. ప్రమాదకరంగా వేలాడాడు. అయినప్పటికీ డ్రైవర్ ఆ కారును ఆపలేదు. సుమారు మూడు కిలోమీటర్ల వరకు కారును అలా డ్రైవ్ చేశాడు. ఆ వ్యక్తిని బానెట్‌పై లాక్కెళ్లాడు. రోడ్డుపై వెళ్లేవారు, ఇతర వాహనదారులు ఇది చూసి షాక్ అయ్యారు.
కాగా, కారు బానెట్‌పై ఉన్న వ్యక్తి చివరకు తప్పించుకున్నాడు. దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Watch: गाजियाबाद में एक कार चालक ने एक शख्स को बोनट पर लटकाकर करीब तीन किलोमीटर तक घुमाया। यह घटना सीसीटीवी में कैद हो गई। जानकारी के मुताबिक, गाड़ी में टक्कर के बाद दोनों के बीच विवाद हो गया था।#Ghaziabad #Video pic.twitter.com/OaDF51SNXJ
— Hindustan (@Live_Hindustan) February 25, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- car’s bonnet
- dragged
- Ghaziabad
- MAN
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

