Daughter forced to consume pesticide | కూతురుతో బలవంతంగా పురుగు మందు తాగించిన తండ్రి
Daughter forced to consume pesticide | క్లాస్‌మేట్‌తో ప్రేమ వ్యవహారం నేపథ్యంలో కూతురుపై తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐరాన్ రాడ్‌తో ఆమెను కొట్టడంతోపాటు బలవంతంగా పురుగు మందు తాగించాడు. (Daughter forced to consume pesticide) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
తిరువనంతపురం: క్లాస్‌మేట్‌తో ప్రేమ వ్యవహారం నేపథ్యంలో కూతురుపై తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐరాన్ రాడ్‌తో ఆమెను కొట్టడంతోపాటు బలవంతంగా పురుగు మందు తాగించాడు. (Daughter forced to consume pesticide) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. కేరళలోని కొచ్చీలో ఈ సంఘటన జరిగింది. ఒకే స్కూల్లో చదువుతున్న 14 ఏళ్ల బాలిక, 16 ఏళ్ల యువకుడి మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం ఆమె తండ్రికి తెలిసింది. దీంతో అతడికి దూరంగా ఉండాలని, ఫోన్లో మాట్లాడవద్దని కుమార్తెను హెచ్చరించాడు.
కాగా, అక్టోబర్ 29న ఆదివారం ఆ బాలిక తన ప్రియుడితో మొబైల్ ఫోన్లో మాట్లాడింది. గమనించిన తండ్రి దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మొబైల్ ఫోన్ లాక్కోవడంతోపాటు ఐరన్ రాడ్‌తో కూతుర్ని కొట్టాడు. అంతటితో ఆగక క్రిమి సంహారక మందును బలవంతంగా తాగించాడు. ఆ బాలిక అస్వస్థత చెందగా ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు బాలిక తండ్రి ఆమెతో బలవంతంగా పురుగు మందు తాగించిన విషయాన్ని ఆసుపత్రి వర్గాలు పోలీసులకు తెలిపాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో బాలిక తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యాయత్నం వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

