man accidentally kills girlfriend | ప్రమాదవశాత్తు ప్రియురాలిని చంపిన వ్యక్తి.. ఆపై గొంతు కోసి, మృతదేహాన్ని పడేసిన వైనం
man accidentally kills girlfriend | ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు ప్రియురాలిని చంపాడు. (man accidentally kills girlfriend) భయాందోళన చెందిన అతడు బ్లేడ్‌తో ఆమె గొంతు కోశాడు. ఆ తర్వాత మహిళ మృతదేహాన్ని సమీపంలోని పొలాల్లో పడేశాడు.
న్యూఢిల్లీ: ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు ప్రియురాలిని చంపాడు (man accidentally kills girlfriend). అనంతరం బ్లేడ్‌తో ఆమె గొంతు కోసిన అతడు ఆ మహిళ మృతదేహాన్ని సమీపంలోని పొలాల్లో పడేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఉధమ్ సింగ్ నగర్ ప్రాంతంలోని కనోరి గ్రామంలో ఒక మహిళ మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలిని సావిత్రి దేవిగా గుర్తించారు. ఆ మహిళ హత్యపై దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. నిందితుడైన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడ్ని ప్రశ్నించగా ఆ మహిళను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.
కాగా, నిందితుడు, హతురాలైన సావిత్రి దేవి వివాహితులని పోలీసులు తెలిపారు. ఆ మహిళ అతడితో కలిసి పని చేస్తున్నదని చెప్పారు. గత ఎనిమిదేళ్లుగా వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందన్నారు. అయితే సావిత్రి తనను మోసగిస్తున్నట్లు తెలుసుకున్న అతడు ఆమెతో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో ఆమెను తోసేయగా నేలపై పడింది. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే చనిపోయింది.
మరోవైపు సావిత్రి దేవి మరణించడంతో ఆ వ్యక్తి భయాందోళన చెందాడు. తప్పుదారి పట్టించేందుకు షేవింగ్ బ్లేడ్‌తో ఆమె గొంతు కోశాడు. ఆ తర్వాత ఆ మహిళ మృతదేహాన్ని సమీపంలోని పొలాల్లో పడేశాడు. ప్రియురాలిని హత్య చేసిన నిందితుడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఆమె గొంతు కోసేందుకు వినియోగించిన షేవింగ్ బ్లేడ్‌ను అతడి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Accidentally
- girlfriend
- Kills
- MAN
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

