Mamata Banerjee | ‘సందేశ్‌ఖాలీపై మాట్లాడటానికి ముందు..’: బీజేపీపై విరుచుకుపడ్డ మమతాబెనర్జీ
Mamata Banerjee | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో.. రాజ్‌భవన్‌లోనే మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. సందేశ్‌ఖాలీపై నెలల తరబడి అసత్య ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలు దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
Mamata Banerjee : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో.. రాజ్‌భవన్‌లోనే మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. సందేశ్‌ఖాలీపై నెలల తరబడి అసత్య ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలు దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
సందేశ్‌ఖాలీపై తెగ మాట్లాడుతున్న ప్రధాని గవర్నర్ వ్యవహారంపై ఎందుకు నోరు తెరవడం లేదని మమతాబెనర్జీ ఫైర్ అయ్యారు. సందేశ్‌ఖాలీపై మాట్లాడేముందు రాజభవన్లో గవర్నర్‌పై వచ్చిన ఆరోపణలపై మాట్లాడాలన్నారు. గవర్నర్ తనను లైంగికంగా వేధించాడని బెంగాల్ రాజ్‌భవన్‌లో కాంట్రాక్టు ఉద్యోగినిగా పనిచేస్తున్న ఓ మహిళ ఆరోపించారు. ఈ ఆరోపణలు ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.
గతంలో సందేశ్‌ఖాలీలో తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షేక్ షాజహాన్పైన, టీఎంసీకే చెందిన ఇద్దరు జిల్లా పరిషత్ సభ్యులు ఉత్తమ్ సర్దార్, శిబూ హజ్రాపైన లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. మహిళలపై వారు ఇష్టారీతిగా అఘాయిత్యాలకు పాల్పడినట్లు పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో బీజేపీ నేతలు టీఎంసీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో సందేశ్‌ఖాలీపై మాట్లాడేందుకు గవర్నర్‌పై మాట్లాడాలని మమత మండిపడుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

