‘Makan wapas lo’ protest | ముస్లిం డాక్టర్‌కు ఫ్లాట్ అమ్మడంపై.. హిందువుల నిరసన
'Makan wapas lo' protest | ముస్లిం డాక్టర్‌కు ఫ్లాట్ అమ్మడంపై హిందువులు నిరసన వ్యక్తం చేశారు. ఫ్లాట్‌ను వెనక్కి తీసుకోవాలని అమ్మిన వ్యక్తిని డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్ద బ్యానర్‌తో హౌసింగ్ సొసైటీ వద్ద నిరసన చేపట్టారు.
లక్నో: ముస్లిం డాక్టర్‌కు ఫ్లాట్ అమ్మడంపై హిందువులు నిరసన వ్యక్తం చేశారు. ఫ్లాట్‌ను వెనక్కి తీసుకోవాలని అమ్మిన వ్యక్తిని డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్ద బ్యానర్‌తో హౌసింగ్ సొసైటీ వద్ద నిరసన చేపట్టారు. (‘Makan wapas lo’ protest) ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. పోష్ ప్రాంతమైన స్థానిక టీడీఐ సిటీ సొసైటీలో నివసించే డాక్టర్ అశోక్ బజాజ్ తన ఫ్లాట్‌ను డాక్టర్ ఇక్రా చౌదరికి విక్రయించారు.
కాగా, ఈ విషయం తెలిసి ఆ హౌసింగ్ సొసైటీకి చెందిన హిందువులు గురువారం ఆ కాలనీ గేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ‘మకాన్ వాపస్ లో’ అన్న పేరుతో పెద్ద బ్యానర్‌ను ప్రదర్శించారు. ‘డాక్టర్ అశోక్ బజాజ్ అప్నా మకాన్ వాపస్ లో’ అని నినాదలు చేశారు.
ఆ సోసైటీలో 400కుపైగా హిందూ కుటుంబాలు నివసిస్తున్నాయని నిరసకారులు తెలిపారు. ఇతర వర్గాల ప్రజలు ఇక్కడ నివసించడం తమకు ఇష్టం లేదన్నారు. సామరస్య వాతావరణానికి భంగం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లిం డాక్టర్‌కు అమ్మిన ఇల్లు గుడికి సమీంలో ఉందన్నారు.
మరోవైపు ముస్లిం డాక్టర్‌కు ఇంటిని విక్రయించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సొసైటీ సభ్యులు ఫిర్యాదు చేశారని జిల్లా కలెక్టర్ అనుజ్ కుమార్ సింగ్ తెలిపారు. సంబంధిత వర్గాలతో మాట్లాడుతున్నట్లు చెప్పారు. సామరస్యపూర్వక పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

