హర్యానా కెమికల్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం
చండీగఢ్: హర్యానాలోని కెమికల్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోనిపట్ జిల్లాలోని కుండ్లీ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మంటలు భారీగా వ్యాపించడంతో అదుపుచేసేందుకు ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది సహాయాన్ని హర్యానా ప్రభుత్వం కోరింది. దీంతో ఢిల్లీ అగ్నిమాపక వాహనాలు, బృందాలు కూడా సహాయ కార్యకలాపాల్లో పాల్గొన్నాయి. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. ప్రాణ నష్టం గురించి ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు. అగ్నిప్రమాదానికి కారణం ఏమిటన్నది కూడా తెలియలేదు. మరోవైపు స్థానికులు ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తమ మొబైల్ ఫోన్లో రికార్డు చేశారు. దీంతో ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
A fire has broken out in a chemical factory in the Kundli area of Sonipat, Haryana. On the special request of Haryana, the Delhi fire service also sent its firefighters for the operation. The cause of the fire is not yet known: Delhi Fire Service pic.twitter.com/ml5PRPqpEu
— ANI (@ANI) April 17, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

