మహారాష్ట్రలో ఐదంచెల అన్‌లాక్
- రేపటి నుంచి అమలుకు నిర్ణయం
- ఢిల్లీలో 50% సామర్థ్యంతో మెట్రో రైళ్లు

ముంబై, జూన్ 5: మహారాష్ట్రలో కరోనా లాక్డౌన్ ఆంక్షల సడలింపునకు ఐదంచెల ప్రణాళికను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 3 నాటికి పాజిటివిటీ రేటు, ఆక్సిజన్ పడకల ఆక్యుపెన్సీ స్థాయి ఆధారంగా సోమవారం నుంచి ఆంక్షలను ఉపసంహరించనున్నారు. ఈ విషయంలో ప్రతి మున్సిపల్ ప్రాంతాన్ని, జిల్లాను ప్రత్యేక పరిపాలన ప్రాంతంగా పరిగణిస్తారు. ఈ మేరకు ఉద్ధవ్ ఠాక్రే సర్కారు ఒక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. మొదటి క్యాటగిరీ కింద 5 శాతం పాజిటివిటీ రేటు, ఆక్సిజన్ పడకల ఆక్యుపెన్సీ 25 శాతంలోపు ఉన్న నగరాలు, జిల్లాల్లో ఆంక్షలను సడలిస్తారు. ఇలాంటి ప్రాంతాల్లో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రారంభమవుతాయి. ఉత్పత్తి, వ్యవసాయ, ఆర్థిక కార్యకలాపాలకు అనుమతి లభిస్తుంది.
5వ క్యాటగిరీ కిందకు వచ్చే నగరాలు, జిల్లాలకు మినహా ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ఈ-పాస్‌ల అవసరం కానీ నిషేధాజ్ఞలు కానీ ఉండవు. 20 శాతం కంటే ఎక్కువగా పాజిటివిటీ రేటు, 75 శాతానికి మించి ఆక్సిజన్ పడకల ఆక్యుపెన్సీ ఉంటే ఆ ప్రాంతాలు 5వ క్యాటగిరీ పరిధిలోకి వస్తాయి. 2 నుంచి 5వ క్యాటగిరీలోకి వచ్చే నగరాలు, జిల్లాల్లో వేర్వేరు స్థాయిల్లో ఆంక్షల సడలింపు ఉంటుంది. వ్యాపార, వాణిజ్య సంస్థలు పనిచేసే వేళలు, వేడుకలు, సమావేశాలకు ఎంతమంది అతిథులు హాజరుకావచ్చు. కాగా, దేశ వాణిజ్య రాజధాని ముంబై 2వ క్యాటగిరీలోకి వస్తుంది. రెస్టారెంట్లు, మాల్స్, థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు, ఆడిటోరియంలు, జిమ్‌లు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు 50 శాతం ఆక్యుపెన్సీతోనే పనిచేయాలి. కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉంటాయి.
ఢిల్లీ మార్కెట్లలో సరి-బేసి విధానం
సోమవారం నుంచి ఢిల్లీలో మెట్రో రైళ్ల్లు 50 శాతం సామర్థ్యంతో నడుస్తాయని, మార్కెట్లు, మాల్స్లోదుకాణాలను సరి-బేసి విధానంలో తెరిచేందుకు అనుమతి ఉంటుందని సీఎం కేజ్రీవాల్ చెప్పారు. తమిళనాడు, గోవా, హిమాచల్ ప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ను ఈ నెల 14 వరకు పొడిగించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

