కోళ్లు గుడ్లు పెట్టడం లేదని పోలీసులకు ఫిర్యాదు
కోళ్లు గుడ్లు | కోళ్లు గుడ్లు పెట్టడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడమేంటని అనుకుంటున్నారా? ఇది నిజమే. ఎందుకంటే ఓ కంపెనీ తయారు చేసిన దాణాను

ముంబై : కోళ్లు గుడ్లు పెట్టడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడమేంటని అనుకుంటున్నారా? ఇది నిజమే. ఎందుకంటే ఓ కంపెనీ తయారు చేసిన దాణాను ఆ కోళ్లు తినడమే అందుకు కారణమని తేలింది. పుణె జిల్లాకు చెందిన ఓ రైతు తన పొలంలో కోళ్లం ఫారం నిర్వహిస్తున్నాడు. అయితే ఇటీవలే అహ్మద్నగర్ జిల్లాకు చెందిన ఓ కంపెనీ దాణాను కోళ్లకు పెట్టాడు. ఆ దాణా తిన్న తర్వాత కోళ్లు గుడ్లు పెట్టడం మానేశాయి. దీంతో సదరు రైతు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ రైతుకు తోడుగా మరో నలుగురు రైతులు కూడా ఇదే సమస్యను పోలీసుల వద్ద ప్రస్తావించారు.
ఈ క్రమంలో పోలీసులు దీనిపై ఓ పశు సంవర్ధక అధికారిని సంప్రదించారు. ఆ అధికారి మాట్లాడుతూ.. దాణా పడకపోవడం వల్లే కోళ్లు గుడ్లు పెట్టడం మానేస్తాయని, ఇది సాధారణ విషయమేనని తెలిపారు. వేరే దాణా పెడితే మళ్లీ గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయని చెప్పారు. గతంలో ఇలాంటి సంఘటనలు చాలా చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు.
అయితే దాణా ఉత్పత్తి చేసిన కంపెనీ యజమానిని కూడా పోలీసులు విచారించారు. తమ కంపెనీ తయారు చేసిన దాణా తినడంతో కోళ్లు గుడ్లు పెట్టడం మానేసిన కారణంగా.. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తానని యజమాని ఒప్పుకున్నాడు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో కోళ్లకు, వాటి గుడ్లకు భలే డిమాండ్ పెరిగింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- eggs
- Poultry Farm
- Pune Farmers
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

