minister bhoomipuja for traffic signal | ట్రాఫిక్ సిగ్నల్ కోసం భూమిపూజ చేసిన బీజేపీ మంత్రి.. సోషల్ మీడియాలో గొప్పగా ప్రచారం
minister bhoomipuja for traffic signal | బీజేపీకి చెందిన ఒక మంత్రి ఏకంగా ట్రాఫిక్ సిగ్నల్ కోసం భూమిపూజ చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో గొప్పగా ప్రచారం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ మంత్రి తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
ముంబై: బీజేపీకి చెందిన ఒక మంత్రి ఏకంగా ట్రాఫిక్ సిగ్నల్ కోసం భూమిపూజ చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో గొప్పగా ప్రచారం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ మంత్రి తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ పాలిత మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది. (minister bhoomipuja for traffic signal) బీజేపీ నేత, మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ఆశిష్ షెలార్, ముంబైలోని తన వందే వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 97వ వార్డులో ఒక చోట ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు కోసం భూమిపూజ చేశారు. ఈ విషయాన్ని ఎక్స్ పోస్ట్‌లో చాలా గొప్పగా ఆయన ప్రచారం చేసుకున్నారు. కార్పొరేటర్, మార్కెట్ అండ్ గార్డెన్ కమిటీ చైర్మన్ హేతల్ గాలా, వార్డు అధ్యక్షుడు సచిన్ మాండ్లిక్, పార్టీ కార్యకర్తలు, స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఆయన పేర్కొన్నారు.
కాగా, ఒక ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు కోసం మంత్రి ఆశిష్ షెలార్ భూమిపూజ చేసినట్లు తెలుసుకుని ప్రజలు నోరెళ్లబెట్టారు. పైగా అదేదో గొప్ప ఘనకార్యం లేదా పెద్ద ప్రాజెక్ట్ అన్నట్లుగా సోషల్ మీడియాలో ఆయన ప్రచారం చేసుకోవడం చూసి విస్తూపోయారు. ప్రజలకు కల్పించాల్సిన ప్రాథమిక సౌకర్యాలకు కూడా పెద్ద కటౌట్లు పెట్టుకుని కార్యక్రమాలు నిర్వహించడం, ప్రత్యేక సందర్భాలుగా ప్రచారం చేసుకోవడాన్ని కొందరు విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
minister bhoomipuja for traffic signal | ట్రాఫిక్ సిగ్నల్ కోసం భూమిపూజ చేసిన బీజేపీ మంత్రి.. సోషల్ మీడియాలో గొప్పగా ప్రచారం
Human Egg | మానవ అండాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు.. ఈడీ దాడుల్లో భారీగా నగదు, ఆస్తులు సీజ్
BRS Party | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ ఇన్ఛార్జీల నియామకం
GST reforms | జీఎస్టీలో సంస్కరణలు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు.. వీరికి లబ్ధి
Bihar Man Kills Wife | అనుమానంతో భార్యను చంపి.. మృతదేహాన్ని కాలువలో పడేసిన భర్త
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

