Man Steals Uncle’s Gold To Buy Thar | బాబాయ్ ఇంట్లో బంగారం దొంగిలించి.. థార్ కొనుగోలు చేసిన వ్యక్తి
Man Steals Uncle's Gold To Buy Thar | ఒక యువకుడు తన బాబాయ్ ఇంట్లో బంగారు ఆభరణాలు దొంగిలించాడు. వాటిని అమ్మి థార్ వాహనం కొనుగోలు చేశాడు. వాహనం పూజ కోసం బాబాయ్‌ను కూడా అతడు ఆహ్వానించాడు.
ముంబై: ఒక యువకుడు తన బాబాయ్ ఇంట్లో బంగారు ఆభరణాలు దొంగిలించాడు. వాటిని అమ్మి థార్ వాహనం కొనుగోలు చేశాడు. వాహనం పూజ కోసం బాబాయ్‌ను కూడా అతడు ఆహ్వానించాడు. బంగారు నగలు మాయంపై ఆయన ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసిన పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. (Man Steals Uncle’s Gold To Buy Thar) మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సతావే గ్రామానికి చెందిన 19 ఏళ్ల సమర్ చవాన్, తన ఇంటి సమీపంలో నివసించే బాబాయ్ ఉమేష్ మారుతి చవాన్ ఇంట్లో నెల రోజుల కిందట 15 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించాడు. స్థానిక స్వర్ణకారుడైన సంగ్రామ్ బాబాసో మోరే సహాయంతో రూ.10 లక్షలకు వాటిని అమ్మాడు. ఆ డబ్బుతో కొత్త మహీంద్రా థార్‌ను అతడు కొనుగోలు చేశాడు.
కాగా, కొత్త వాహనాన్ని ఇంటికి తెచ్చిన తర్వాత పూజకు రావాలని బాబాయ్ ఉమేష్ చవాన్‌ను సమర్ ఆహ్వానించాడు. ఆ కార్యక్రమం కోసం నగలు ధరించాలని భావించిన ఉమేష్‌కు అవి కనిపించకపోవడంతో దొంగతనం జరిగినట్లు గ్రహించాడు. అయితే ఉమేష్ అమ్మమ్మకు చెందిన నగలు పక్కనే ఉన్నప్పటికీ వాటిని ఎవరూ తాకలేదు. కేవలం ఉమేష్, అతడి భార్యకు చెందిన నగలు మాత్రమే మాయమయ్యాయి. దీంతో కుటుంబానికి చెందిన వ్యక్తే ఆ బంగారు నగలు చోరీ చేసినట్లు ఆయన అనుమానించాడు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
మరోవైపు పోలీసులు సమర్పై అనుమానం వ్యక్తం చేశారు. ఆ యువకుడు అకస్మాత్తుగా కొత్త కారు కొనుగోలు చేయడానికి అవసరమైన డబ్బును ఎలా సమకూర్చాడు అన్న దానిపై దర్యాప్తు చేశారు. కీలక ఆధారాలు లభించడంతో సమర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించారు. తానే దొంగతనానికి పాల్పడినట్లు అంగీకరించడంతో అతడితో పాటు బంగారు వ్యాపారి సంగ్రామ్ మోరేను కూడా అరెస్ట్ చేశారు. ఆ బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actor Dhanush | రాజకీయ అరంగేట్రంపై ధనుష్ దూకుడు.. మహిళా అభిమానులతో కీలక భేటీ!
Man Steals Uncle’s Gold To Buy Thar | బాబాయ్ ఇంట్లో బంగారం దొంగిలించి.. థార్ కొనుగోలు చేసిన వ్యక్తి
Houthis | మేం మక్కా, మదీనాపై దాడి చేశామనడం అబద్ధం.. సౌదీ చమురుక్షేత్రాలే మా లక్ష్యం : హౌతీస్
EU Mahadharna | EU మహా ధర్నాకు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ మద్దతు
Baththa | ఓటీటీలోకి విజయ్ సేతుపతి సూపర్ హిట్ మూవీ ‘బత్తా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

