Supriya Sule | సుప్రియా సూలే అల్లుడికి చెందిన సంస్థకు.. 1,200 ఎకరాల భూమిని లీజుకిచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం
Supriya Sule | మహారాష్ట్ర అహల్యనగర్ జిల్లాలోని హరేగావ్ గ్రామంలో ఉన్న 1,200 ఎకరాల సారవంతమైన భూమిని ముంబైకి చెందిన ‘విశ్వరాజ్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థకు ప్రభుత్వం లీజుకు ఇచ్చింది.
ముంబై: మహారాష్ట్ర అహల్యనగర్ జిల్లాలోని హరేగావ్ గ్రామంలో ఉన్న 1,200 ఎకరాల సారవంతమైన భూమిని ముంబైకి చెందిన ‘విశ్వరాజ్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థకు ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. (Supriya Sule) శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే అల్లుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు సన్నిహితుడైన బీజేపీ ఎమ్మెల్సీ అరుణ్ లఖానీ కుమారుడైన సారంగ్ లఖానీకి చెందిన సంస్థ ఇది. మహారాష్ట్ర స్టేట్ ఫార్మింగ్ కార్పొరేషన్ ఆధీనంలో ఉన్న ఈ భూమిని ఆ సంస్థకు 49 ఏళ్ల కాలానికి లీజుకు ఇస్తూ అక్టోబర్ 5న ఉత్తర్వులు జారీ చేశారు.
అలాగే ప్రభుత్వ ఆమోదానికి లోబడి, విశ్వరాజ్ రెన్యూవబుల్స్ ఆ భూమిని తన అనుబంధ సంస్థకు లేదా తన గ్రూపులోని మరో కంపెనీకి లీజుకు ఇచ్చేందుకు కూడా అనుమతించారు. ఈ ప్రయోజనం కోసం మహారాష్ట్ర రాష్ట్ర వ్యవసాయ సంస్థ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) పొందాల్సిన అవసరం నుంచి కూడా ఆ కంపెనీకి మినహాయింపు ఇచ్చారు.
కాగా, మరో ప్రైవేట్ సంస్థ ‘నిబే గ్రూప్’కు 1,500 ఎకరాల భూమిని లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన రెండు వారాల వ్యవధిలోనే ఈ కేటాయింపు జరిగింది. రక్షణ సంబంధిత ప్రాజెక్టుల కోసం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో)కు కూడా అక్కడున్న 1,500 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది.
మరోవైపు ఈ కేటాయింపుల కారణంగా హరేగావ్లో దీర్ఘకాలంగా ఉన్న భూ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. బ్రిటీష్ పాలనలో స్థానిక రైతుల నుంచి సుమారు 7,376 ఎకరాల భూమిని సేకరించారు. దీంతో అసలు భూ యజమానులు, వారి కుటుంబాలు తమ భూమిని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు రైతులకు భూమిని తిరిగి అప్పగించాలని సెప్టెంబర్ 15న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే తాజాగా ప్రైవేట్ సంస్థలకు ఈ భూముల కేటాయింపు, అనుసరించిన విధానం, లీజు నిబంధనలు, ఆ భూమిపై అసలు రైతు కుటుంబాలకు ఉన్న హక్కుల విషయంలో అనేక ప్రశ్నలు లేవనెత్తాయి. టెండర్ ప్రక్రియ లేకుండా ప్రభుత్వ భూమిని ఒక ప్రైవేట్ కంపెనీకి కేటాయించడాన్ని సామాజిక కార్యకర్త అంజలి దమానియా ప్రశ్నించారు. 48 సంవత్సరాల లీజును మరో 48 సంవత్సరాల పాటు పొడిగించుకునే వీలుండటాన్ని ఆమె తప్పుపట్టారు. సెక్యూరిటీ డిపాజిట్‌ను ఎందుకు మాఫీ చేశారని ఆమె ప్రశ్నించారు. కొంతమంది వ్యాపారవేత్తలు రాజకీయాల్లోకి ప్రవేశించి, డబ్బు సంపాదించడానికి రాజకీయ అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు.
కాగా, మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం తన అల్లుడి సంస్థకు కేటాయించిన ఈ భూమి వివాదంపై సుప్రియా సూలే స్పందించారు. తన అల్లుడి వ్యాపార, వృత్తిపరమైన కార్యకలాపాలు పూర్తిగా ఆయన వ్యక్తిగత విషయాలని ఆమె అన్నారు. ‘నా అల్లుడు ఏ వ్యాపారం లేదా పని చేస్తున్నాడనేది పూర్తిగా అతని వ్యక్తిగత విషయం. దానిపై నేనెలా వ్యాఖ్యానించగలను?’ అని ప్రశ్నించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- firm
- land
- Leases
- Maharashtra
RELATED ARTICLES
తాజా వార్తలు
Supriya Sule | సుప్రియా సూలే అల్లుడికి చెందిన సంస్థకు.. 1,200 ఎకరాల భూమిని లీజుకిచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం
పురాతన ఆలయ గోపురం ధ్వంసం.. సుదర్శన చక్రం చోరీకి యత్నం?
‘గీత కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలి’
Ram Charan | రామ్ చరణ్ కీలక నిర్ణయం.. బాలీవుడ్ దర్శకుడికి నో చెప్పారా?
‘రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందించాలి’
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

