CJI | టెక్నాలజీపై ఆధారపడడం వల్ల కలిగే దుష్పరిణామాలను చూశాం : సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
CJI | మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్‌ను స్థాపించి.. 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైక్రోసాఫ్ట్ సాంకేతిక లోపం నేపథ్యంలో శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన గందరగోళ పరిస్థితులపై స్పందించారు.
CJI | మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్‌ను స్థాపించి.. 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైక్రోసాఫ్ట్ సాంకేతిక లోపం నేపథ్యంలో శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన గందరగోళ పరిస్థితులపై స్పందించారు. మైక్రోసాఫ్ట్ అప్డేట్లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా విమానాలపై తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే. ఢిల్లీ, హైదరాబాద్ సహా పలు నగరాల్లో విమానాలు పెద్ద ఎత్తున రద్దయ్యాయి. అలాగే కోర్టుల్లో ప్రత్యక్ష ప్రసారాలపై సైతం ప్రతికూల ప్రభావం పడింది. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ తాను సాంకేతిక ప్రయోజనాలను విశ్వసిస్తున్నానన్నారు.
అయితే, టెక్నాలజీపై ఆధారపడడం వల్ల కలిగే దుష్పరిణామాలను నిన్ననే చూశామన్నారు. మధురై ప్రజల ప్రేమ కారణంగా తాను ఈ రోజుకు ఇక్కడ ఉండగలిగానని సీజేఐ పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ మధురైని తుంగా నగరం, నిద్రపోని నగరంగా పిలుస్తారన్నారు. నగరానికి వచ్చేవారి కోసం మార్కెట్లు ఎప్పుడూ ప్రజల కోసం తెరిచే ఉంటాయన్నారు. గొప్పనగరం ఆతిథ్య సంస్కృతిని ప్రతిబింబిస్తుందని.. కాబట్టి మద్రాస్ హైకోర్టు శాశ్వత బెంచ్గా మధురైని ఎంపిక చేయడంలో ఆశ్చర్యం లేదన్నారు. ‘న్యాయం ఎప్పుడూ నిద్రపోదు అనేదానికి మధురై శాశ్వత చిహ్నం’ అని సీజేఐ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

