Modi Nomination | ఈ నెల 14న వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్.. దానికి ముందు..
Modi Nomination | ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 14న వారణాసి లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రధాని నామినేషన్ కోసం బీజేపీ శ్రేణులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నాయి. నామినేషన్ సందర్భంగా ప్రధాని రెండు రోజులపాటు వారణాసిలో ఉండనున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండు రోజుల్లో భారీ రోడ్‌షో, ప్రచార సభల్లో మోదీ పాల్గొంటారని తెలుస్తోంది.
Modi Nomination : ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 14న వారణాసి లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రధాని నామినేషన్ కోసం బీజేపీ శ్రేణులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నాయి. నామినేషన్ సందర్భంగా ప్రధాని రెండు రోజులపాటు వారణాసిలో ఉండనున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండు రోజుల్లో భారీ రోడ్‌షో, ప్రచార సభల్లో మోదీ పాల్గొంటారని తెలుస్తోంది.
ప్రధాని మోదీ నామినేషన్ ఏర్పాట్లను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సీనియర్ నాయకుడు సునీల్ బన్సల్ కూడా ఈ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ దాఖలుకు ముందు పలు ఆలయాలను దర్శించుకునే అవకాశాలు ఉన్నాయి. కాశీ విశ్వనాథుడు, కాలభైరవ ఆలయాలను ప్రధాని మోదీ దర్శించుకునే చాన్స్ ఉంది.
బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి కాశీ విశ్వనాథుడి ఆలయం వరకు ఐదు కిలోమీటర్ల మేర ప్రధాని మోదీ నాలుగు గంటలపాటు రోడ్‌షో నిర్వహించనున్నారు. అదేరోజు ఎన్డీఏ నేతల సమావేశంలో కూడా పాల్గొంటారని సమాచారం. కాగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన దగ్గరి నుంచి ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. మే 30 తేదీ వరకు మోదీ మోదీ ప్రచార కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పాతికేండ్లయినా ప్రమోషన్ నిల్.. అత్యంత దయనీయ స్థితిలో ఎస్జీటీలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

