Lithium Reserves: జమ్మూకశ్మీర్‌లో లిథియం నిక్షేపాలు
Lithium Reserves:లిథియం నిక్షేపాలను గుర్తించారు. జమ్మూకశ్మీర్‌లో సుమారు 5.9 మిలియన్ టన్నుల లిథియం రిజర్వ్‌లు ఉన్నట్లు కేంద్ర సర్కారు ప్రకటించింది.
న్యూఢిల్లీ: దేశంలో తొట్టతొలి సారి లిథియం నిక్షేపాలను గుర్తించారు. జమ్మూకశ్మీర్‌లో సుమారు 5.9 మిలియన్ టన్నుల లిథియం రిజర్వ్‌లు ఉన్నట్లు కేంద్ర సర్కారు ప్రకటించింది. ఈవీ బ్యాటరీల తయారీలో లిథియం మూలకం కీలకమైనదన్న విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్‌లోని రిసాయి జిల్లాలో ఉన్న సలాల్ హైమనా ప్రాంతంలో ఆ నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పేర్కొన్నది. లిథియం, బంగారంతో పాటు 51 ఖనిజ నిక్షేపాల సమాచారాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చేరవేసినట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపింది.
బంగారంతో పాటు పొటాషియం, మోలిబ్డీనియం, ఇంకా ఇతర బేస్ మూలకాలకు చెందిన నిక్షేపాలను 11 రాష్ట్రాల్లో గుర్తించారు. కశ్మీర్‌తో పాటు ఏపీ, చత్తీస్ఘడ్, గుజరాత్, జార్ఖండ్, కర్నాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఆ నిక్షేపాలు ఉన్నట్లు గనులశాఖ తెలిపింది.
బొగ్గు, లిగ్నైట్‌కు చెందిన నిక్షేపాల 17 నివేదికలను కూడా కేంద్రానికి సమర్పించారు. 7897 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు బొగ్గు శాఖకు తెలియజేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

