Law student | లా విద్యార్థిపై సహ విద్యార్థుల దాడి.. ఎందుకంటే..!
Law student | ఓ ప్రైవేట్ యూనివర్సిటీ (Private university) లో లా విద్యార్థి (Law student) పై అతడి సహ విద్యార్థులే దాడికి పాల్పడ్డారు. వర్సిటీలోని పార్కింగ్ ప్లేసులో ఈ దాడి జరిగింది. ఐదుగురు విద్యార్థులు అతడిని కారులో కూర్చోబెట్టి కొట్టారు. ఓ యువతి, యువకుడు బాధితుడి చెంపలే లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు.
Law student : ఓ ప్రైవేట్ యూనివర్సిటీ (Private university) లో లా విద్యార్థి (Law student) పై అతడి సహ విద్యార్థులే దాడికి పాల్పడ్డారు. వర్సిటీలోని పార్కింగ్ ప్లేసులో ఈ దాడి జరిగింది. ఐదుగురు విద్యార్థులు అతడిని కారులో కూర్చోబెట్టి కొట్టారు. ఓ యువతి, యువకుడు బాధితుడి చెంపలే లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు. మిగతా ముగ్గురు విద్యార్థులు ఈ తతంగాన్ని అంతా వీడియో తీసి యూనివర్సిటీ గ్రూప్లో వైరల్ చేశారు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాజధాని లక్నో (Lukcnow) లోని అమిటీ విశ్వవిద్యాలయం (Amiti university) లో ఈ ఘటన చోటుచేసుకుంది.
‘లా’ ద్వితీయ సంవత్సరం చదువుతున్న శిఖర్ అనే యువకుడిపై ఆయుష్ యాదవ్, ఝాన్వీ మిశ్రా, మిలాయ్ బెనర్జీ, వివేక్ సింగ్, ఆర్యమన్ శుక్లా అనే సహ విద్యార్థులు దాడికి దిగారు. ఏకంగా 50-60 చెంప దెబ్బలు కొట్టారు. ఈ ఘటన కలకలం రేపుతోంది. వారం క్రితం జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాడికి పాల్పడిన బృందంలోని ఓ విద్యార్థి రికార్డు చేసి క్యాంపస్లో వైరల్ చేశారు. పార్కింగ్ జాగాలో ఆపిన కారులో ఈ దాడి జరిగింది.
ఆయుష్ యాదవ్, ఝాన్వీ మిశ్రా మరో యువకుడు పదేపదే శిఖర్ చెంప చెల్లుమనిపించారు. బాధితుడి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు అయిదుగురు విద్యార్థులపై కేసు నమోదు చేశారు. ‘ముఖం పైనుంచి చేయి తియ్.. క్యారక్టర్ గురించి నువ్వేమన్నావ్?’ అంటూ చెంపలపై కొట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

