న్యూఢిల్లీ, జూలై 31: రాజస్థాన్ ‘లేడీ డాన్’, ‘రివాల్వర్ రాణి’గా పేరున్న అనురాధా చౌదరిని పోలీసులు ఎట్టకేలకు ఆరు నెల ల గాలింపు అనంతరం అరెస్ట్ చేశారు. 12కు పైగా క్రిమినల్ కేసుల్లో నిందితురాలైన ఆమె కోసం పోలీసులు చాలా రాష్ర్టాల్లో గాలించారు. చివరకు యూపీలోని సహరన్‌పూర్‌లో ఉన్న ఆమెను అరెస్ట్ చేశారు. 37 ఏండ్ల ఆమెపై కిడ్నాప్, దోపిడీ, బలవంతపు వసూళ్లు, కాల్పులు వంటి కేసులు ఉన్నాయి. గతంలో ఆమె అనంద్పాల్సింగ్ అనే గ్యాంగ్‌స్టర్ ముఠాలో సభ్యురాలుగా ఉండే ది. అతను 2017లో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో హతమయ్యాడు. అనంతరం ఆమె కాలా జఠేడీగ్యాంగ్లో చేరిం ది. శనివారం ఆమెతో పాటు జఠేడీని కూడా పట్టుకున్నారు. వ్యాపారులను భయపెట్టి డబ్బు వసూలు చేసేందుకు తన ఏకే-47 రైఫిల్‌తో గాలిలోకి కాల్పులు జరుపుతుంటుంది.