హైదరాబాద్, అక్టోబర్ 8: భారత్‌లో తన స్టార్‌లింక్ కంపెనీ సేవలను అందించకుండా అడ్డుకున్న కుబేరుల పేర్లను బయటపెట్టి వారు సిగ్గుపడేలా చేయాలని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కోరారు.
‘ఎలాన్ ఆ కుబేరుల పేర్లను బయటపెట్టి వారిని సిగ్గుపడేలా చేయండి. మన ప్రభుత్వంపై పట్టు ఎవరు బిగించారో భారత దేశం తెలుసుకోవాలనుకుంటున్నది’ అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.