Kolkata rape murder | ఆర్జీ కర్ హాస్పిటల్లో హత్యాచార బాధితురాలి విగ్రహం.. చెలరేగిన వివాదం
Kolkata rape murder | పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో హత్యాచారానికి గురైన బాధిత ట్రైనీ డాక్టర్ విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించారు. ‘క్రై ఆఫ్ ది హవర్’ పేరుతో దీనిని ఏర్పాటు చేశారు. దీంతో ఈ అంశంపై మరో వివాదం చెలరేగింది.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో హత్యాచారానికి గురైన బాధిత ట్రైనీ డాక్టర్ విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించారు. (Kolkata rape murder) ‘క్రై ఆఫ్ ది హవర్’ పేరుతో దీనిని ఏర్పాటు చేశారు. దీంతో ఈ అంశంపై మరో వివాదం చెలరేగింది. కళాకారుడు అసిత్ సైన్ ‘క్రై ఆఫ్ ది హవర్’ పేరుతో ఒక విగ్రహాన్ని రూపొందించారు. ఒక మహిళ ఏడుస్తున్నట్లుగా ఉన్న ఈ విగ్రహం జీవితంలోని చివరి నిమిషాల్లో బాధితురాలు పడిన వేదన, భయానక స్థితిని ప్రతిబింబిస్తున్నదని పేర్కొన్నారు. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ కార్యాలయం ఉన్న భవనం సమీపంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
కాగా, హత్యాచార బాధితురాలి విగ్రహం ఏర్పాటుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. బాధితురాలిని అగౌరవ పరిచేలా, చాలా అసహ్యకరంగా ఈ విగ్రహం ఉందని కొందరు విమర్శించారు. అత్యాచార బాధితురాలి విగ్రహాన్ని దేశంలో ఎక్కడైనా, ఎప్పుడైనా ఏర్పాటు చేశారా? అని ఒకరు ప్రశ్నించారు.
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత కునాల్ ఘోష్ కూడా ఈ విగ్రహంపై స్పందించారు. బాధితురాలి పేరు, గుర్తింపును వెల్లడించ కూడదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు ఇది విరుద్ధమని అన్నారు.
‘బాధ్యతాయుతులైన వారెవరూ అలా చేయరు. కళ పేరుతో కూడా చేయలేరు. నిరసనలు, న్యాయం కోసం డిమాండ్లు ఉన్నాయి. కానీ బాధతో కూడిన అమ్మాయి ముఖంతో విగ్రహం సరైనది కాదు. బాధితురాలి ఫొటోలు లేదా విగ్రహాలు వినియోగించకూడదని మార్గదర్శకాలు ఉన్నాయి’ అని ట్వీట్ చేశారు.

Statue
మరోవైపు ఆర్జీ కర్ హాస్పిటల్కు చెందిన డాక్టర్ దేబ్దత్ ఈ విగ్రహం గురించి మీడియాతో మాట్లాడారు. తాము ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని, కోర్టు ఆదేశాలను నిర్లక్ష్యం చేయలేదని తెలిపారు. ‘ఈ విగ్రహం బాధితురాలిది కాదు. కానీ ఆమె అనుభవించిన నొప్పి, హింస, కొనసాగుతున్న నిరసనలకు చిహ్నం’ అని అన్నారు. ఇది కేవలం సింబాలిక్ శిల్పమని, ఆ రోజు ఏమి జరిగిందో, ఆమె పడిన బాధను అధికారులకు చూపించాలనుకుంటున్నామని తెలిపారు. బాధితురాలికి న్యాయం కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు.
కాగా, కోల్కతాలోని జూనియర్ డాక్టర్లు మంగళవారం నుంచి విధులకు దూరంగా ఉన్నారు. తమ డిమాండ్ల కోసం మళ్లీ సమ్మె బాట పట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

