Giant Killers | కేఎల్ శర్మ నుంచి యూసుఫ్ పఠాన్ వరకూ.. కేంద్ర మంత్రులు.. మాజీ మంత్రులను మట్టి కరిపించిన జెయింట్ కిల్లర్స్ వీరే..!
Giant Killers | బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ కూటమి తిరిగి అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నా, కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని ఇండియా కూటమి..అధికార బీజేపీకి గట్టి సవాల్ విసిరింది. సుదీర్ఘంగా సాగిన ఎన్నికల్లో ప్రముఖులు మట్టికరిచారు.
Giant Killers | గత దశాబ్ద కాలంగా దేశ రాజకీయాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన బీజేపీ.. 2024-లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటున్నది. బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ కూటమి తిరిగి అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నా.. తక్కువ అంచనా వేసిన కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని ఇండియా కూటమి అనూహ్య ఫలితాలు సాధించింది. అధికార బీజేపీకి గట్టి సవాల్ విసిరింది. సుదీర్ఘంగా సాగిన ఎన్నికల్లో ప్రముఖులు మట్టికరిచారు.
అమేథీ జెయింట్ కిల్లర్ కిశోర్‌లాల్ శర్మ
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి గత ఎన్నికల్లో తొలిసారి ప్రాతినిధ్యం వహించిన కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఓటమి బాటలో ఉన్నారు. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న కిశోర్ లాల్ శర్మ విజయానికి చేరువలో ఉన్నారు. 25 ఏండ్ల తర్వాత తొలిసారి అమేథీ నుంచి గాంధీయేతర నేత పోటీ చేసి గెలవడం గమనార్హం.
బారాముల్లాలో ఫరూఖ్ అబ్దులాకు ఓటమి
జమ్ముకశ్మీర్ రాజకీయాల్లో తొలి నుంచి కీలక పాత్ర పోషించిన నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా ఓటమిని అంగీకరించారు. బారాముల్లా నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజినీర్ రషీద్ గెలుపొందారు. ఇంజినీర్ రషీద్‌ను ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ వేదికగా అభినందించారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.
మెహబూబాపై ఆధ్యాత్మిక నేత మియాన్ అల్తాఫ్ అహ్మద్ గెలుపు
బకేర్వాల్, గుజ్జర్ సామాజిక వర్గాల నుంచి ఆధ్యాత్మికనేతగా పేరొందిన మియాన్ అల్తాఫ్ అహ్మద్.. అనంత నాగ్ స్థానం నుంచి విజయం సాధించారు. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ పై ఆయన గెలుపొందారు.
భూపేష్ భాఘేల్‌ను మట్టి కరిపించిన సంతోష్ పాండే
ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని రాజ్‌నందన్‌గావ్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన బీజేపీ అభ్యర్థి సంతోష్ పాండే.. మాజీ సీఎం భూపేష్ బాఘేల్ మీద విజయం సాధించారు. మూడు దశాబ్దాలకు పైగా బీజేపీకి గట్టి పట్టు ఉన్న స్థానంగా రాజ్‌నందన్‌గావ్ నుంచి భూపేష్ బాఘేల్ ఓటమి పాలవ్వడం కాంగ్రెస్ పార్టీకి నిరాశనే మిగిల్చింది.
బహరాంపూర్ నుంచి అధీర్‌కు యూసుఫ్ పఠాన్ చెక్
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బహరాంపూర్ లోక్ సభ స్థానం నుంచి వరుసగా ఐదుసార్లు గెలుపొందుతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరికి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి.. రాజకీయ అరంగ్రేటం చేసిన యూసుఫ్ పఠాన్ చెక్ పెట్టారు. సుదీర్ఘకాలంగా అధీర్ రంజన్ చౌదరిపై యూసుఫ్ పఠాన్ విజయం.. మమతా బెనర్జీ కీలక గెలుపుగా భావించవచ్చు.
సుల్తాన్ పూర్లో మేనకాగాంధీ ఔట్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సుల్తాన్ పూర్ నుంచి సిట్టింగ్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి మేనకాగాంధీ ఓటమి పాలయ్యారు. మేనకాగాంధీపై ఎస్పీ అభ్యర్థి రాంభువాల్ నిషాద్ ఆధిపత్యం ప్రదర్శించారు. 2019లో బీఎస్పీ అభ్యర్థి చంద్రభద్ర సింగ్‌పై 15 వేల మెజారిటీతో గెలుపొందారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

