Khudiram Bose : చేతిలో భగవద్గీత.. నవ్వుతూ ఉరికంభంపైకి..
Khudiram Bose : ఆయనను ఉరితీసే నాటికి ఆయన వయసు కేవలం 18 సంవత్సరాల.. 8 నెలల.. 8రోజులు. దేశం కోసం బ్రిటీషర్లతో కొట్లాడి నవ్వుతూ ఉరికంభం ఎక్కాడు..

దేశం కోసం చిన్నతనంలో ప్రాణాలు అర్పించిన విప్లవకారుడు ఖుదీరాం బోస్ (Khudiram Bose). ఆయనను ఉరితీసే నాటికి ఆయన వయసు కేవలం 18 సంవత్సరాల.. 8 నెలల.. 8రోజులు. దేశం కోసం బ్రిటీషర్లతో కొట్లాడి నవ్వుతూ ఉరికంభం ఎక్కాడు. చేతిలో భగవద్గీత పట్టుకుని 1908 లో సరిగ్గా ఇదే రోజున ప్రాణాలు వదిలాడు. దేశం కోసం అప్పటి అధికారులును ఎదిరించడం, ఏకంగా చీఫ్ జడ్జీనే హత్య చేసేందుకు బాంబు విసిరడం వంటి ధైర్యసాహసాలు ప్రదర్శించాడు.
పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లాలో 1889 డిసెంబర్ 3 న జన్మించిన ఖుదీరాం బోస్.. చిన్ననాటనే తల్లిదండ్రులు చనిపోవడంతో సోదరి వద్ద పెరిగాడు. మిడ్నాపూర్ జిల్లాలో అరబిందో, సిస్టర్ నివేదిత వచ్చి చేసిన ప్రసంగాలకు ఆకర్శితుడై విప్లవకారుడిగా మారాడు. 15 ఏండ్ల వయసులోనే అనుశీలన్ సమితి వాలంటీర్‌గా పనిచేసి బ్రిటీషర్లకు వ్యతిరేకంగా కరపత్రాలు పంచుతూ అరెస్టయ్యాడు. 18 ఏండ్ల వయసులో చీఫ్ జడ్జీ డగ్లాస్ కింగ్‌ఫోర్డ్‌ను హత్య చేసే బాధ్యత ఖుదీరాం బోస్, ప్రఫుల్లా చాకీపై ఉంచారు. ఏప్రిల్ 30 న బ్రిడ్జ్ ఆడి ఇంటికి వస్తున్న కింగ్‌ఫోర్డ్‌పై దాడి చేయడానికి బదులుగా పొరపాటున న్యాయవాది కెన్నెడీపై బాంబులు విసిరారు. ఈ ఘటనలో కెన్నెడీ భార్య చనిపోయింది.
పోలీసులకు దొరక్కుండా పారిపోయిన తర్వాత ప్రఫుల్లా తనకు తాను కాల్చుకుని చావగా.. ఖుదీరాం బోస్ పోలీసులకు దొరికిపోయాడు. దాంతో ఆయనను విచారించి ఉరిశిక్ష విధిస్తూ తీర్పుచెప్పారు. ముజఫ్పర్‌పూర్ జైలులో ఆగస్ట్ 11 న నవ్వుతూ ఉరికంభం ఎక్కాడు. ఖుదీరాం బోస్ సేవలకు గుర్తుగా ముజఫ్పర్‌పూర్ జైలుకు ఖుదీరాం బోస్ స్మారక కేంద్ర కారాగారం అని పేరు పెట్టారు. అలాగే, ఆయన పట్టుబడిన రైల్వే స్టేషన్‌ను ఖుదీరాం బోస్ పూసా రైల్వేస్టేషన్‌గా మార్చారు.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
2008 : బీజింగ్ ఒలింపిక్స్‌లో షూటింగ్లో పసిడి పతకం సాధించిన భారత షూటర్ అభినవ్ భింద్రా
2004 : వాంటెడ్ క్రిమినల్స్ జాబితాను పంచుకున్న భారత్, పాకిస్తాన్ దేశాలు
2003 : ఆఫ్ఘనిస్తాన్ శాంతి పరిరక్షణ బాధ్యతను తీసుకున్న నాటో దళాలు
1988 : ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలో అల్‌ఖైదా ప్రారంభం
1984 : భూగర్భ అణుపరీక్షలను నిర్వహించిన సోవియట్ యూనియన్
1962 : వోస్టోక్-3 ని ప్రయోగించిన సోవియట్ యూనియన్
1961 : దాద్రా నగర్ హవేలిని భారత భూభాగం కిందకు చేర్చుకుని కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటన
1960 : ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్న ఆఫ్రికన్ దేశం చాద్
1948 : రెండో ప్రపంచ యుద్ధం అనంతరం తొలిసారిగా ఒలింపిక్ గేమ్స్ ప్రారంభం
1914 : ఆస్ట్రియా, హంగేరిపై యుద్ధం ప్రకటించిన ఫ్రాన్స్
ఇవి కూడా చదవండి..
ఇలా నీరజ్ ‘పసిడి’కి గుర్తింపు..
వీరి నివాసం కేరాఫ్ పోలీస్ స్టేషన్..!
నీరజ్ చోప్రా ‘పసిడి’ రహస్యమిదే..?!
అంతరిక్షంలో వరుడు.. టెక్సాస్‌లో వధువు.. వీడియో కాల్లో పెండ్లి
రక్తంలో షుగర్ నియంత్రణకు కృత్రిమ క్లోమం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

