కర్నాటక నూతన సీఎం కీలక నిర్ణయాలు

బెంగళూర్ : కర్నాటక తదుపరి సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటలకే బసవరాజ్ బొమ్మై బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ వేయి కోట్లతో రైతుల పిల్లల కోసం నూతన స్కాలర్షిప్ పధకం ప్రకటించారు. వితంతు పింఛన్‌ను రూ 600 నుంచి రూ 800కు, సంధ్యా సురక్ష పధకం కింద వృద్ధాప్య పింఛన్‌ను రూ 1000 నుంచి రూ 1200కు పెంచారు. పింఛన్ పెంపుతో 35.98 లక్షల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని సీఎం బొమ్మె వెల్లడించారు.
ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై రూ 863 కోట్ల అదనపు భారం పడుతుందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకుని వనరులను పూర్తిగా వినియోగించుకుంటూ ప్రభుత్వం ఆర్ధిక క్రమశిక్షణతో ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తాను క్యాబినెట్ సహచరులతో అధికారులతో సమావేశమయ్యానని, వరదలు..కొవిడ్-19ను దీటుగా ఎదుర్కోవడం తమ ప్రభుత్వ ప్రధాన అజెండా అని స్పష్టం చేశానని బొమ్మై పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
One Lakh Crore | నెలకు రూ.10వేల జీతం.. కానీ బ్యాంక్ అకౌంట్లో లక్ష కోట్లు.. చివరకు షాక్!
Rajeev Kanakala | ‘డ్రాగన్’తో ఎన్టీఆర్ అభిమానులు రెండు కాలర్లు ఎగరేయడం ఖాయం.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Traffic Challan | ఫుట్‌పాత్‌పై బైక్ నడిపితే రూ.5 వేలు.. వన్‌వేలో వెళ్తే రూ.10 వేల ఫైన్? బెంగళూరులో కఠినంగా ట్రాఫిక్ రూల్స్!!
Bigg Boss 10 | త్రిగుణ్‌కు అదిరిపోయే గిఫ్ట్.. ముఖేష్, వంశీ మధ్య తీవ్ర వాగ్వాదం
Census 2027 | దేశవ్యాప్తంగా జనగణనకు ముహూర్తం ఖరారు.. జనవరి 25 నుంచి ఇంటింటికీ లెక్కింపు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

