Kerala: శబరిమలలో మద్యం, డ్రగ్స్, పొగాకు వాడకంపై నిషేధం విధించిన కేరళ ప్రభుత్వం
'మండలం మకరవిళక్కు' పండుగ సందర్భంగా శబరిమలలో మద్యం, డ్రగ్స్, పాగాకుపై నిషేధం
అయ్యప్ప స్వామి భక్తులు కేరళలోని శబరిమల క్షేత్రాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు. ప్రతి ఏడాది ఈ క్షేత్రంలో రెండు నెలల పాటు ‘మండలం మకరవిళక్కు’ పండుగ వైభవంగా జరుగుతుంది. ఈ ఏడాది మరో మూడు రోజుల్లో ఈ పండుగ ప్రారంభం కానుంది. దాంతో, ఆలయ పరిసరాలను నవంబర్ 14 నుంచి వచ్చే ఏడాది జనవరి 22వ తేదీ వరకు ‘లిక్కర్, డ్రగ్స్ ఫ్రీ జోన్’గా కేరళ ప్రభుత్వం ప్రకటించింది. శబరిమలలోని వ్యాపారులు, శబరిమలకు వచ్చే భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని అధికారులు తెలిపారు. అంతేకాదు మందు, డ్రగ్స్, పొగాకుపై విధించిన నిషేధాన్ని ఎవరూ ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోనున్నారు. అందులో భాగంగా పోలీసులు, ఎక్సైజ్ శాఖ, అటవీ శాఖ అధికారుల బృందం ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించనున్నారు.
పలు భాషల్లో బోర్డులు
ఆలయ పరిసరాల్లో ‘ఇక్కడ మద్యం, డ్రగ్స్, పొగాకు వంటివి నిషేధం’ అని పలు భాషల్లో రాసున్న బోర్డులని అధికారులు చాలా చోట్ల ఏర్పాటు చేశారు. శబరిమల ఆలయ పరిసరాలతో పాటు పంబ, త్రివేణి, మరకూట్టం, శబరి పీడంతో పాటు పెరినాడు, కొల్లాములా గ్రామాల్లో కూడా ఈ నిషేధం వర్తించనుంది. ‘మండలం మకరవిళక్కు’ వేడుకని చూసేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా లక్షలాదిమంది భక్తులు శబరిమల యాత్రకు వెళ్తారు. రెండు నెలల పాటు జరిగే ఈ పండుగ వచ్చే 2023 జనవరి 15వ తేదీన ముగుస్తుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pragya Jaiswal | వెకేషన్ మూడ్‌లో ప్రగ్యా జైస్వాల్.. అదిరిపోయిన అవుట్డోర్ ఫొటోషూట్!
Anirudh-Kavya | అనిరుధ్ -కావ్య మారన్ పెళ్లి సందడి షురూ.. గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్, చెన్నై రిసెప్షన్
Uranium Stockpile: యురేనియంను తరలించనున్న ఇరాన్
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమాలో హీరోయిన్గా తెలుగు అమ్మాయి.. రేసులోకి ఆ అమ్మడి పేరు!
School Van | కురవిలో స్కూల్ వ్యాన్ బోల్తా, 12 మంది విద్యార్థులకు గాయాలు.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా?
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

