కేరళలో 1.7 లక్షలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు

తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. వరుసగా వారం రోజులుగా 20 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా యాక్టివ్ కేసులు 1.7 లక్షలకు పెరిగాయి. గత రెండు నెలలుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు రికార్డవుతున్నాయి. కాగా, మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 22,414 కరోనా కేసులు, 108 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 34,71,563కు, మొత్తం మరణాల సంఖ్య 17,211కు పెరిగింది.
మరోవైపు గత 24 గంటల్లో 19,478 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 32,77,788కు చేరుకున్నదని, ప్రస్తుతం 1,76,048 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా హాట్‌స్పాట్‌గా కేరళ కొనసాగుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

