Karnataka Minister Eshwarappa Resign | దిగొచ్చిన సర్కార్.. మంత్రి ఈశ్వరప్ప రాజీనామా?
Karnataka Minister Eshwarappa Resign | కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్‌ను 40 % పర్సెంటేజీ అడిగిన మంత్రి ఈశ్వరప్ప పదవికి రాజీనామా చేశారు.
Karnataka Minister Eshwarappa Resign | ఎట్టకేలకు కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప తన మంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. శుక్రవారం ఈశ్వరప్ప తన మంత్రి పదవికి రాజీనామా చేస్తారు. వివిధ కాంట్రాక్టులలో తనకు 40 శాతం వాటా ఇవ్వాలని కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్‌ను మంత్రి ఈశ్వరప్ప డిమాండ్ చేసినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
మంత్రి ఈశ్వరప్ప ఒత్తిళ్లు, బెదిరింపులు తాళలేక రెండు రోజుల క్రితం సంతోష్ పాటిల్ ఆత్మహత్యకు పాల్పడటంతో కర్ణాటకలో రాజకీయ కలకలం చెలరేగింది. సంతోష్ పాటిల్ తన మరణ వాంగ్మూలంలో మంత్రి ఈశ్వరప్ప ఒత్తిళ్ల వల్లే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ప్రకటించారు.దీంతో ఈశ్వరప్ప, ఆయన సన్నిహితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈశ్వరప్పను మంత్రి వర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్ భారీ ఆందోళనకు దిగింది. ఈశ్వరప్ప, ఆయన సన్నిహితులపై ఎఫ్ఐఆర్ దాఖలు కావడంతో మంత్రికి సీఎం బసవరాజు బొమ్మై సమన్లు జారీ చేశారు. విపక్షాలు ఒత్తిడి పెంచడంతో మంత్రి ఈశ్వరప్పను రాజీనామా చేయాలని సీఎం బస్వరాజు బొమ్ము ఆదేశించారు. తొలుత మంత్రి ఈశ్వరప్ప రాజీనామా చేయబోరని వార్తలొచ్చాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders Attack | ఫేస్బుక్ మెటా ఆఫీస్ పై కాంగ్రెస్ నాయకుల దాడి
Hyderabad | నీటి ట్యాంకు నుంచి వృథాగా పోతున్న తాగునీరు..
Enugula Rakesh Reddy | యూత్ డిక్లరేషన్ పేరుతో యువతను మోసం చేసిన కాంగ్రెస్ : ఏనుగుల రాకేష్‌రెడ్డి
Road Accident | ఆటో బోల్తా..ఐదుగురికి గాయాలు
Sensational Comments | రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు.. సోనియాగాంధీకి సీనియర్ నాయకుడు లేఖ
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

