Karnataka | కర్ణాటకలో కరెంట్ కష్టాలు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు బెంగళూరులో రోజూ 4 గంటల కోత
కర్ణాటకను కరెంట్ కష్టాలు చుట్టుముట్టాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు రాజధాని బెంగళూరు సహా అనేక ప్రాంతాల్లో విద్యుత్తు కోతలు ప్రజల్ని ఇబ్బందికి గురిచేస్తున్నాయి.
- రాజధాని బెంగళూరులో రోజూ 4 గంటల కోత
- రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన థర్మల్ విద్యుత్తు ఉత్పాదన
(స్పెషల్ టాస్క్ బ్యూరో)
Karnataka | హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): కర్ణాటకను కరెంట్ కష్టాలు చుట్టుముట్టాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు రాజధాని బెంగళూరు సహా అనేక ప్రాంతాల్లో విద్యుత్తు కోతలు ప్రజల్ని ఇబ్బందికి గురిచేస్తున్నాయి. గత నాలుగు రోజులుగా రాష్ట్ర రాజధాని బెంగళూరులో రోజుకు నాలుగు గంటల చొప్పున కోతలు విధిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య సరఫరా నిలిపివేస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అనధికార కోతలు ఆరేడు గంటల పాటు విధిస్తున్నట్టు సమాచారం. ఒకవైపు విద్యుత్తు కోతలు, మరోవైపు చార్జీల పెంపుతో పారిశ్రామిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కర్ణాటక చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పిలుపు మేరకు వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వర్గాలు జూన్ 22న బంద్ పాటించి నిరసన వ్యక్తం చేశాయి.
రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్తు కేంద్రాలలో ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. రాయచూర్, యరమారస్, జిందాల్ (బళ్లారి), ఉడుపి విద్యుత్తు కేంద్రాలలో కలిపి మొత్తం 7,680 మెగావాట్ల విద్యుత్తు ఉత్పాదన జరగాలి. కానీ గత మంగళవారం విద్యుత్తు ఉత్పత్తి కేవలం 945 మెగావాట్ల వద్దే ఆగిపోయింది. 1200 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్లు ఉన్న ఉడుపిలో ఉత్పత్తి పూర్తిగా స్తంభించింది. రాయచూర్‌లో 1, 2, 3, 6, 7 యూనిట్లలో ఉత్పాదన నిలిచిపోయింది. బళ్లారిలో ఒక యూనిట్ మాత్రమే పని చేయడంతో కేవలం 169 మెగావాట్లకు పరిమితమైంది. యరమరాస్ రెండో యూనిట్లో ఉత్పాదన ఆగిపోగా ఒకటో యూనిట్లో 403 మెగావాట్ల ఉత్పత్తి నమోదైంది. 55 మెగావాట్ల ఉత్పాదన ఆపినట్టు జిందాల్ పేర్కొంది. బొగ్గు కొరత లేకపోయినా, జలాశయాలలో నీటి మట్టం పెరుగుతున్నా రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పాదన పడిపోవడానికి కారణమేంటో అధికారులు చెప్పడం లేదు.
ఆందోళన బాటలో విద్యుత్తు ఉద్యోగులు
రాష్ట్రంలో ఇటీవల విద్యుత్తు ఉద్యోగులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. విధి నిర్వహణలో మరణించిన లైన్మెన్ కుటుంబాలకు, వైకల్యం చెందిన ఉద్యోగులకు రూ.25 లక్షల వరకు నష్టపరిహారం చెల్లించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సస్పెండ్ చేసిన ఉద్యోగులపై సత్వరమే విచారణ పూర్తి చేసి తప్పులేని వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నాయి. గ్రేడ్-1 ఇంజినీర్లు, గ్యాంగ్మెన్లు, లైన్మెన్లు, మీటర్ రీడర్లు ధర్నాకు సంఘీభావం ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajeev Kanakala | ‘డ్రాగన్’తో ఎన్టీఆర్ అభిమానులు రెండు కాలర్లు ఎగరేయడం ఖాయం.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Traffic Challan | ఫుట్‌పాత్‌పై బైక్ నడిపితే రూ.5 వేలు.. వన్‌వేలో వెళ్తే రూ.10 వేల ఫైన్? బెంగళూరులో కఠినంగా ట్రాఫిక్ రూల్స్!!
Bigg Boss 10 | త్రిగుణ్‌కు అదిరిపోయే గిఫ్ట్.. ముఖేష్, వంశీ మధ్య తీవ్ర వాగ్వాదం
Census 2027 | దేశవ్యాప్తంగా జనగణనకు ముహూర్తం ఖరారు.. జనవరి 25 నుంచి ఇంటింటికీ లెక్కింపు!
Aurangzeb Tomb | ఔరంగజేబు సమాధి తొలగింపునకు డెడ్‌లైన్ ఫిక్స్.. సంచలన ప్రకటన చేసిన మహారాష్ట్ర మంత్రి!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

