Karnataka | కర్ణాటకలో ‘సీఎం కుర్చీ’ఆట.. కుంపటి రాజేస్తున్న కాంగ్రెస్ నేతలు
కర్ణాటకలో మళ్లీ కుర్చీలాట మొదలయ్యింది. లోక్‌సభ ఎన్నికలు ముగిసే వరకు నిశ్శబ్దంగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కుంపటి రాజేస్తున్నారు.
- డీకే, సిద్ధరామయ్య వర్గాల మధ్య తీవ్రమైన పోరు
- మరో ముగ్గురిని డిప్యూటీ సీఎంలుగా నియమించాలి
- డీకేకు చెక్ పెట్టేందుకు సిద్ధరామయ్య వర్గం డిమాండ్
- పీసీసీ అధ్యక్ష పదవి వదులుకోవాలని సైతం ఒత్తిడి
- శివకుమార్‌ను సీఎం చేయాలంటున్న ఆయన వర్గం
Karnataka | బెంగళూరు: కర్ణాటకలో మళ్లీ కుర్చీలాట మొదలయ్యింది. లోక్‌సభ ఎన్నికలు ముగిసే వరకు నిశ్శబ్దంగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కుంపటి రాజేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు చెక్ పెట్టేందుకు సిద్ధరామయ్య వర్గం మరో ముగ్గురిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. మరోవైపు సిద్ధరామయ్య ఇక ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దిగిపోయి శివకుమార్‌కు అప్పగించాలని ఆయన వర్గం కొత్త రాగం అందుకున్నది. దీంతో కర్ణాటక కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. డీకేను నిలవరించేందుకు సిద్ధరామయ్య, సిద్ధరామయ్యకు ఎసరు పెట్టేందుకు డీకే తెరవెనుక ఉండి తమ వర్గీయులతో బాహాటంగా ప్రకటనలు చేయిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది.
మరో ముగ్గురు డిప్యూటీ సీఎంలు
ప్రస్తుతం కర్ణాటకలో డీకే శివకుమార్ మాత్రమే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఆయనతో పాటు లింగాయత్, ఎస్సీ/ఎస్టీ, మైనారిటీ వర్గాల నుంచి ఒక్కొక్కరి చొప్పున మరో ముగ్గురిని డిప్యూటీ సీఎంలుగా నియమించాలని మంత్రి కేఎన్ రాజన్న డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌లో ఒక్కరికి ఒకే పోస్టు ఇవ్వాలనే పద్ధతి ఉందని, ఈ పద్ధతిని పాటించి డీకే శివకుమార్ తన పీసీసీ అధ్యక్ష పదవిని వదులుకోవాలని సైతం రాజన్న పేర్కొన్నారు. డీకే శివకుమార్‌కు చెక్ పెట్టేందుకు సీఎం సిద్ధరామయ్య వర్గం ఈ రెండు వాదనలను తెరపైకి తెచ్చినట్టు సమాచారం.
డీకేను ముఖ్యమంత్రిని చేయాలి
డీకే శివకుమార్‌కు వ్యతిరేకంగా సిద్ధరామయ్య వర్గం పావులు కదుపుతుండటంతో డీకే వర్గం కూడా అప్రమత్తమైంది. సిద్ధరామయ్య సీఎం పదవిని వదిలి శివకుమార్‌కు అప్పగించాలని చెన్నగిరి ఎమ్మెల్యే బసవరాజు శివగంగ బుధవారం డిమాండ్ చేశారు. సిద్ధరామయ్య గతంలో ఐదేండ్లు, ఇప్పుడు ఏడాదిన్నర సీఎంగా ఉన్నారని, ఇక దిగిపోవాలని పేర్కొన్నారు. మరో ముగ్గురు డిప్యూటీ సీఎంలను నియమించాలనే వాదనను కూడా డీకే వర్గం తప్పుపడుతున్నది. డిప్యూటీ సీఎం పదవి ఖాళీ లేదని మంత్రి చెలువరాయస్వామి.. సిద్ధరామయ్య వర్గానికి కౌంటర్ ఇచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

