Kangana Ranaut | సభలో విపక్ష సభ్యుల తీరు ఆమోదయోగ్యం కాదు : కంగనా రనౌత్
నీట్ రగడ పార్లమెంట్ ఉభయసభలనూ కుదిపివేసింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్, పరీక్ష నిర్వహణ లోటుపాట్లపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో లోక్‌సభలో గందరగోళం నెలకొనడంతో సభ జులై 1కి వాయిదా పడింది.
Kangana Ranaut : నీట్ రగడ పార్లమెంట్ ఉభయసభలనూ కుదిపివేసింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్, పరీక్ష నిర్వహణ లోటుపాట్లపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో లోక్‌సభలో గందరగోళం నెలకొనడంతో సభ జులై 1కి వాయిదా పడింది. రాజ్యసభలోనూ నీట్ ప్రకంపనలతో సభా కార్యకలాపాలు స్తంభించాయి. విపక్షాల తీరును బీజేపీ ఎంపీ, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తప్పుపట్టారు.
సభలో ప్రతిపక్ష సభ్యుల తీరు సరైంది కాదని దుయ్యబట్టారు. స్పీకర్ పలుమార్లు సంయమనంతో వ్యవహరించాలని పదేపదే కోరినా విపక్ష సభ్యులు పెడచెవిన పెట్టారని, విపక్షం ఎవరి మాటా వినిపించుకనే పరిస్ధితిలో లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తాము సభలో తొలిసారిగా అడుగుపెట్టమని, విపక్షాల రగడ చూసి తాము విస్తుపోయామని అన్నారు.
ఏ ఒక్కరినీ మాట్లాడేందుకు వారు అనుమతించకపోవడం సరైంది కాదని చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను విస్మరించి విపక్షాలు సభలో రచ్చ చేయడం విడ్డూరమని కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు.సభలో విపక్ష సభ్యుల ప్రవర్తన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. కాగా, విపక్షాలు ఏ అంశం లేవనెత్తినా సమగ్ర సమాచారం ఇస్తామని తాము స్పష్టంగా చెప్పినా విపక్షాలు సభా కార్యకలాపాలకు అడ్డుపడటం విచారకరమని పార్లమెంటరీ వ్యవహరాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.
ప్రభుత్వం చర్చకు సిద్ధమని తాము సభ్యులకు మరోసారి హామీ ఇస్తున్నామని చెప్పారు. సభా కార్యకలపాలకు కాంగ్రెస్ సభ్యులు అడ్డుపడుతూ సభను సజావుగా జరగనివ్వకపోవడం సరైంది కాదని, దీన్ని తాను ఖండిస్తున్నానని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. సభా కార్యకలాపాలకు అడ్డుతగలవద్దని ఆయా సభ్యులకు తాను విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి చెప్పారు. కాగా, నీట్ వ్యవహారంలో ప్రభుత్వ తీరును కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ తప్పుపట్టారు.
Read More :
Pawan Kalyan | రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. షెడ్యూల్ ఇదే..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

