Kalpana Soren: కల్పనా సోరెన్ ఆస్తులెంత? ఆమె ఏం చేస్తుంది?
Kalpana Soren: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ కోటీశ్వరాలు అని తెలుస్తోంది. ఆమెను ఓ స్కూల్‌ను నడుపుతోంది. ఆమె పేరిట కొన్ని బిల్డింగ్లు ఉన్నాయి. కోట్లు ఖరీదు చేసే బంగారు ఆభరణాలు కూడా ఆమె వద్ద ఉన్నాయి.
రాంచీ: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను భూకుంభకోణం ఆరోపణలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఒకవేళ హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేస్తే, సీఎం పదవిని ఆయన భార్య కల్పనా సోరెన్(Kalpana Soren)కు కట్టబెట్టే అవకాశాలు ఉన్నట్లు కూడా వార్తలు వ్యాపిస్తున్నాయి. అయితే కల్పనా సోరెన్ కూడా కోటీశ్వరాలే అని కొన్ని రిపోర్టుల ద్వారా తెలుస్తోంది.
కల్పనా సోరెన్ 2006లో హేమంత్ సోరెన్‌ను పెళ్లి చేసుకున్నది. ఒడిశాలోని మయూర్బంజ్ జిల్లాకు చెందిన వ్యవయసాయ కుటుంబంలో ఆమె జన్మించారు. కల్పనా సోరెన్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త హేమంత్ కోటీశ్వరుడు. అదే రీతిలో కల్పన కూడా కోటీశ్వరాలే. నిజానికి ఆమె రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నారు. కానీ ఆమె ఓ స్కూల్‌ను నడిపిస్తున్నారు. ఆమె ఆస్తులు మాత్రం కోట్లల్లో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
ఎన్నికల సంఘానికి హేమంత్ ఇచ్చిన అఫిడవిట్ లో ఈ విషయాలు స్పష్టం అవుతున్నాయి. తన భార్య పేరిట కోట్ల ప్రాపర్టీ ఉన్నట్లు హేమంత్ తన అఫిడవిట్లో పేర్కొన్నారు. 2019లో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. కల్పన బ్యాంక్ అకౌంట్లో రూ.2,55,240 ఉన్నాయి. హెచ్ఎస్ ఫ్యూయల్ సంస్థలో ఆమె రెండు లక్షలు పెట్టుబడి పెట్టారు. ఆమె పోస్టాఫీసు అకౌంట్లో రూ.6,79,873 ఉన్నాయి. ఎల్ఐసీ, ఐసీఐసీఐ వద్ద ఆమెకు సుమారు 24 లక్షల విలువైన పాలసీలు ఉన్నాయి. ఆమె పేరు మీద మారుతి సియాజ్ కారు ఉంది. దాని విలువ 5.50 లక్షలు.
కల్పనా సోరెన్ వద్ద లక్షల్లో విలువ చేసే జ్వలరీ ఉన్నది. ఇక ఆమె పేరిట కోట్ల ఖరీదైన భూములు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 655 గ్రాముల బంగారు ఆభరణాలు ఆమె వద్ద ఉన్నట్లు ఓ రిపోర్టులో తేలింది. ఆ జ్వలరీ విలువ సుమారు 25 లక్షలు ఉంటుంది. 20 కిలోల వెండి ఆభరణాలు కూడా ఆమె వద్ద ఉన్నాయి. కల్పన పేరిట మూడు కమర్షియల్ బిల్డింగ్లు ఉన్నాయి. ఆ భవనాల మొత్తం విలువ సుమారు 5 కోట్లు ఉంటుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

