CJI DY Chandrachud: 50వ సీజేఐగా ప్రమాణం చేసిన జస్టిస్ డీవై చంద్రచూడ్
Justice DY Chandrachud :సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్(DY Chandrachud) ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. సీజేఐగా రెండేళ్ల పాటు ఆయన విధులు నిర్వర్తించనున్నారు. 20
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్(DY Chandrachud) ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. సీజేఐగా రెండేళ్ల పాటు ఆయన విధులు నిర్వర్తించనున్నారు. 2024, నవంబర్ 10వ తేదీ వరకు ఆయన సీజేఐగా ఉంటారు. రాష్ట్రపతి భవన్లో ఇవాళ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
జస్టిస్ చంద్రచూడ్ 1959, నవంబర్ 11న జన్మించారు. 1979లో ఆయన ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1982లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి పూర్తి చేశారు. 1983లో హార్వర్డ్ యూనివర్సిటీలో ఎల్ఎల్ఎమ్ చేశారు. 1986లో హార్వర్డ్ నుంచే జురిడికల్ సైన్సెస్‌లో(ఎస్జేడీ) డాక్టర్ పట్టా పొందారు.
44 ఏళ్ల క్రితం సీజేఐ డీవై చంద్రచూడ్ తండ్రి జస్టిస్ వైవీ చంద్రచూడ్ కూడా భారత ప్రధాన న్యాయమూర్తి చేశారు. జస్టిస్ వైవీ చంద్రచూడ్ అత్యధికంగా ఏడేళ్ల పాటు సీజేఐగా చేశారు.
1998 నుంచి 2000 వరకు అదనపు సొలిసిటర్ జనరల్‌గా జస్టిస్ చంద్రచూడ్ చేశారు. 1998లో బాంబే హైకోర్టులో ఆయన సీనియర్ అడ్వకేట్‌గా నమోదు అయ్యారు. పౌర, మత, భాషాపరమైన హక్కులతో పాటు అనేక కేసుల్లో ఆయన వాదించారు. 2000, మార్చి 29న బాంబే హైకోర్టులో అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2013, అక్టోబర్ 31న ఆయన అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అపాయింట్ అయ్యారు. 2016, మే 13వ తేదీన సుప్రీంకోర్టు జడ్జిగా వచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నెల్లిబండలో పంట మార్పిడిపై రైతులకు అవగాహన
MLA Padi Kaushik Reddy | హాస్యాస్పదంగా ఓటు చోరీపై రాహుల్ గాంధీ ధర్నా: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
రేవంత్ రెడ్డి.. అనుముల ఇంటెలిజెన్స్ కాదు, తెలంగాణ ఇంటెలిజెన్స్ ఉపయోగించాలి
IAS Shikhar Agrawal: 40 విల్లాలు కొన్న ఐఏఎస్ ఆఫీసర్.. హోల్డ్‌లో శిఖర్ అగర్వాల్ పోస్టింగ్
ప్రజా తిరుగుబాట్లు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

